ఫౌజీ షూటింగ్‌లో నటుడికి ప్రమాదం.. పీఏ క్లారిటీ..! | Fauji Actor Rajesh Sharma PA Clarity On Injured In Fauji Sets news | Sakshi
Sakshi News home page

Fauji Movie: ఫౌజీ నటుడికి ప్రమాదం.. పీఏ క్లారిటీ..!

Jul 9 2026 5:20 PM | Updated on Jul 9 2026 5:44 PM

Fauji Actor Rajesh Sharma PA Clarity On Injured In Fauji Sets news

ప్రభాస్ హీరోగా వస్తోన్న పీరియాడిల్ యాక్షన్  లవ్‌స్టోరీ  ఫౌజీ. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. దేశ స్వాతంత్య్రానికి పూర్వం జరిగే ఈ కథలో బ్రిటిష్‌ సోల్జర్‌ పాత్రలో ప్రభాస్‌ నటిస్తున్నారని తెలిసింది. ఈ మూవీలో ఇమాన్వి ఇస్మాయిల్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌  నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో పాటు సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ కూడా చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రభాస్ షూటింగ్‌లో ప్రముఖ నటుడు రాజేశ్ శర్మకు విషపురుగు కాటేసిందని ప్రచారం జరుగుతోంది. దీంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారని టాక్ వినిపించింది. ఈ వార్తలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో ఫౌజీ నటుడు రాజేశ్ శర్మ పీఎ స్పందించారు. ఈ వార్తలన్నీ ‍‍అవాస్తమని ఆయన కొట్టిపారేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. 

రాజేశ్ శర్మ పీఏ సుభాశిష్ పాండా మాట్లాడుతూ..' రాజేశ్ శర్మకి ఎటువంటి ఇన్‌ఫెక్షన్ లేదు. ఆయనను ఎలాంటి విషపురుగు కాటేయలేదు. కేవలం ఆయనకు ఉన్న షుగర్ వల్ల కాలు కొద్దిగా వాచింది. అందుకే హాస్పిటల్‌లో చేర్పించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్ కూడా అవుతారు.  రాజేష్ శర్మకి షూటింగ్ చేస్తుండగా ఏదో అయ్యిందంటూ సోషల్ మీడియాలో, కొన్ని మీడియా ఛానల్స్‌లో వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అబద్ధం. రాజేష్ శర్మ ఎక్కడికి వెళ్లినా ఆయనతో పాటు నేను ఉంటా. కేవలం కొందరు తమ స్వార్థం కోసం ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు' అని అన్నారు.  దయచేసి నిజా నిజాలు తెలుసుకోకుండా అసత్య వార్తలను సోషల్ మీడియాలో వైరల్ చేయవద్దని కోరిన పీఏ 
సుభాశిష్ పాండా కోరారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement