పోలీస్ పాత్ర చేస్తున్నా.. మేడమ్ మా మూవీలో ఓ రోల్ చేయండి | Naveen Polishetty Reacts Malkajgiri CP Sumathi Under Cover Video | Sakshi
Sakshi News home page

Naveen Polishetty: నవీన్ పొలిశెట్టి ఎక్కడున్నా నవ్వులే.. లేటెస్ట్ వీడియో

Jul 9 2026 1:30 PM | Updated on Jul 9 2026 1:36 PM

Naveen Polishetty Reacts Malkajgiri CP Sumathi Under Cover Video

నవీన్ పొలిశెట్టి తన సినిమాల్లోనే కాదు బయట కూడా తెగ నవ్విస్తుంటాడు. కొన్నిరోజుల క్రితం రూ.5500 కోట్ల ఫ్రేమ్ అంటూ పలువురు దర్శకులతో ఉన్న వీడియోని పోస్ట్ చేశాడు. ఇప్పుడు పోలీస్ అధికారులని కూడా నవ్వించాడు. మల్కాజ్‌గిరి సీపీ సుమతి మేడమ్‌తో కలిసి నటించాలని ఉందని సరదాగా చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత తిరుపతికి వస్తా.. హింట్ ఇచ్చిన నిధి అగర్వాల్)

మల్కాజ్‌గిరిలో బుధవారం పోలీస్ గేమ్స్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన హీరో నవీన్ పొలిశెట్టి.. తాను తొలిసారి పోలీస్ పాత్రలో నటించనున్నట్లు వెల్లడించాడు. అలానే సీపీ సుమతి మేడమ్ అండర్ కవర్ వీడియో గురించి కూడా మాట్లాడుతూ.. మేడమ్ చాలా బాగా నటించారు. మా సినిమాలో కూడా ఓ రోల్ చేయండి. 'ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ' సీక్వెల్‌లో మీరు నేను కలిసి ఓ కేసు సాల్వ్ చేస్తే బాగుంటుందని అన్నాడు.

హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ వైపు తిరిగి.. 'సార్ నాకు సినిమాలో గన్ ఎలా పట్టుకోవాలో కాస్త నేర్పించండి' అని నవీన్ పొలిశెట్టి కోరాడు. ఇంతలోనే డీజీపీ సీవీ ఆనంద్ జోక్యం చేసుకుని.. గన్ ట్రైనింగ్ ఓకే కానీ ఒరిజినల్ బుల్లెట్లతో కాదు!' అని జోక్ చేశారు. దీనికి స్పందించిన నవీన్.. మా సినిమాల్లో అన్నీ ఫేక్ బుల్లెట్లే ఉంటాయి సార్. అయినా నాకు కనీసం గన్ ఎత్తడం కూడా రాదు అని అమాయకంగా అనేసరికి అక్కడున్న పోలీస్ అధికారులందరూ ఒక్కసారిగా నవ్వేశారు.

(ఇదీ చదవండి: ప్రేమ పేరుతో నాలుగేళ్లు నా వెంటపడ్డాడు: హీరోయిన్ అంజలి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement