ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. గత కొన్నాళ్లలో చూసుకుంటే రష్మిక, సమంత తదితరుల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఓ పక్క సినిమాలు చేసుకుంటూ మరోవైపు ఫ్యామిలీ లైఫ్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడీ లిస్టులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా చేరేలా కనిపిస్తోంది. తాజాగా తన పెళ్లి గురించి హింట్ ఇచ్చేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
(ఇదీ చదవండి: ఈ సినిమాకు A సర్టిఫికెట్ కూడా తక్కువే!)
ఓ మొబైల్ స్టోర్ ఓపెనింగ్ కోసం తాజాగా తిరుపతిలో సందడి చేసిన నిధి అగర్వాల్.. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 'పెళ్లి తర్వాత తిరుపతికి వస్తాను. ప్రస్తుతానికి వివాహం గురించి ప్లాన్స్ ఏం లేవు. ఇంకా పెళ్లి కొడుకు దొరకలేదు. ప్రస్తుతం హిందీ, తెలుగులో తలో రెండు సినిమాలు చేస్తున్నాను' అని చెప్పుకొచ్చింది.

నిధి అగర్వాల్ కెరీర్ విషయానికొస్తే.. హిందీలో తొలుత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో అయితే సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, రాజాసాబ్, హరిహర వీరమల్లు తదితర మూవీస్ చేసింది. కానీ వీటిలో 'ఇస్మార్ట్ శంకర్' తప్పితే ఈమెకు మరో సక్సెస్ అనేది లేకుండా పోయింది. గతేడాది రిలీజైన హరిహర వీరమల్లు, ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన రాజాసాబ్ చిత్రాలపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది కానీ అవి డిజాస్టర్స్ అయ్యాయి. చూస్తుంటే త్వరలో పెళ్లి వార్త ఏమైనా చెబుతుందేమో?
(ఇదీ చదవండి: అవి మాత్రమే పోస్ట్ చేస్తా.. 'సబ్‌స్క్రిప్షన్'పై హీరోయిన్ పాయల్ రాజ్ పుత్)
Actress #NidhhiAgerwal's comments about her marriage are going viral on social media. pic.twitter.com/ubHaVt9Cgo
— Filmyscoops (@Filmyscoopss) July 9, 2026


