'కమిటీ కుర్రోళ్లు' ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, 'సిద్ధార్థ్ రాయ్' ఫేమ్ తన్వీ నేగి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'అదే నీవు అదే నేను'. గోవిందు కాండ్రేగుల నిర్మిస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ కథతో యువ దర్శకుడు కొండల్ రూపొందిస్తున్నారు. త్వరలో మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు.
(ఇదీ చదవండి: ఈ సినిమాకు A సర్టిఫికెట్ కూడా తక్కువే!)
డైరెక్టర్ కొండల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సమాజంలో భార్యలు భర్తల్ని చంపిన క్రైమ్ న్యూస్ చూస్తున్నాం. అలాంటి తరహాలో సాగే రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రమిది. మనం వేసే ఒక తప్పటడుగు, ఆవేశంలో చేసే నేరం.. జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తుంది అనేది ఇందులో చూపించాం. థియేటర్‌లో మా సినిమా చూస్తున్నప్పుడు మీరు ఉలిక్కిపడటం ఖాయం అని అన్నారు.
(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత తిరుపతికి వస్తా.. హింట్ ఇచ్చిన నిధి అగర్వాల్)


