విజయ్ జన నాయగన్.. రిలీజ్‌కు ఆల్ క్లియర్..! | Vijay Jana Nayagan Sensor Issue Solved gets A Certificate from CBFC | Sakshi
Sakshi News home page

Jana Nayagan Movie: జన నాయగన్‌కు లైన్ క్లియర్.. రన్‌టైమ్ ఎంతంటే?

Jul 9 2026 7:10 PM | Updated on Jul 9 2026 8:15 PM

Vijay Jana Nayagan Sensor Issue Solved gets A Certificate from CBFC

దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ జన నాయగన్. ఎప్పుడో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పటి వరకు థియేటర్లలోకి రాలేదు. సెన్సార్ సమస్యలతో పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. రాజకీయాల్లోకి ఎంట్రీకి ముందు విజయ్ నటించిన చివరి చిత్రమిదే. విజయ్ సీఎం అయినా కూడా ఇంకా విడుదల  కాలేదు.

తాజాగా ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది.  ఈ నేపథ్యంలోనే సెన్సార్ ప్రక్రియ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ మూవీ రన్‌టైమ్ 183 నిమిషాలుగా నిర్ణయించింది. గతంలో సెన్సార్ సమస్యల వల్లే ఆ మూవీ రిలీజ్ ఆగిపోయింది. తాజాగా ఆ సమస్య క్లియర్ కావడంతో ఈ నెల 24న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ రిలీజ్ డేట్‌పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే ఓవర్‌సీస్ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల తేదీని అనౌన్స్ చేశారు.

కాగా.. హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ప్రేమలు బ్యూటీ మమిత బైజు, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement