‘లెనిన్‌’ ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎంతంటే..? | Lenin Movie Box Office Collection Day 1 Details | Sakshi
Sakshi News home page

‘లెనిన్‌’ ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎంతంటే..?

Jul 11 2026 2:21 PM | Updated on Jul 11 2026 2:33 PM

Lenin Movie Box Office Collection Day 1 Details

చాలా రోజుల తర్వాత అఖిల్‌ అక్కినేని ఖాతాలో హిట్‌ పడింది. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘లెనిన్‌’. మురళీ కిషోర్‌ అబ్బూరి దర్శకత్వం వహించిన ఈ రూరల్‌ యాక్షన్‌ డ్రామా జులై 10న విడుదలై తొలి రోజే పాజిటివ్‌ టాక్‌ సంపాదించుకుంది. దీంతో తొలి రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.16.7 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ రాబట్టింది. ఈ విషయాన్ని  మేకర్స్ అధికారికంగా ప్రకటించండంతో, తమ హీరోకి హిట్‌ పడిదంటూ అక్కినేని అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. 

ఈ చిత్రంలో అఖిల్‌ ఊరమాస్‌ లుక్‌లో కనిపించాడు.  చిత్తూరు యాసతో ఆయన చెప్పిన డైలాగులు..ప్రేక్షకులను ఈళలు వేయిస్తున్నాయి. అఖిల్‌కి జోడీగా భాగ్యశ్రీ నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించాడు. 

లెనిన్‌ కథేంటంటే.. 
చిత్తూరు జిల్లాలోని శ్రీరామాపురం అనే ఊరిలో ప్రతి ఏటా ద్రౌపది అమ్మ గుడిలో పద్దెనిమిదిరోజుల జాతర జరుగుతుంది. అనాథ అయిన లెనిన్ (అఖిల్) చిన్నతనంలో అంటే 1976లో అక్కడికి వస్తాడు. ఓ సందర్భంలో జయంతి(ఈశ్వరీరావు) ఇతడి గురించి కనుక్కొని అనాథ అని తెలిసి తన ఇంటికి తీసుకెళ్తుంది. తన కన్న కొడుకు వసంత్ (ప్రమోద్)తో పాటే పెంచి పెద్దచేస్తుంది. వసంత్ మద్రాసులో చదువుకొని డాక్టర్ అయి ఊరికి తిరిగొస్తాడు. లెనిన్ మాత్రం చదువుకోకుండా ఊరిలో ఉండిపోతాడు. ఓ ఏడాది జాతర టైంలో భారతి(భాగ్యశ్రీ బోర్సే)ని చూసి లెనిన్ ప్రేమలో పడతాడు. ఆమె కూడా లెనిన్‌ని ఇష్టపడుతుంది. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా భారతిని వసంత్‌కి ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయిస్తారు. మరి అంతా అనుకున్నట్లే జరిగిందా లేదా? ఈ కథలో యతిరాజులు (శివాజీ), దామోదర్ (బ్రహ్మాజీ), పార్థసారథి(సునీల్) ఎవరు? ఈ మహాభారతంలో అసలు విలన్స్ ఎవరు? లెనిన్ చివరకు ఏమయ్యాడు? అనేది మిగతా స్టోరీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement