అఖిల్ ఎట్టకేలకు సక్సెస్ అందుకున్నాడు. థియేటర్లలోకి రిలీజైన 'లెనిన్' పాజిటివ్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులోనే నాగార్జున మాట్లాడుతూ తన కొడుకు అఖిల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
(ఇదీ చదవండి: ‘లెనిన్’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..?)
'అఖిల్‌లో సాధించాలనే తపన ఉంది. చిన్నప్పటి నుంచే ఎనర్జీతో ఉండేవాడు. అందుకే డాక్టర్స్ కూడా వాడిని నేలపై పడుకోబెట్టమని చెప్పేవారు. అలాంటి అఖిల్ సినిమాల కోసం కష్టపడ్టాడు కానీ ఆశించిన విజయం రాలేదు. బయటకు ఏది మాతో చెప్పడు. గాయాలపాలయ్యాడు. కామ్ అయిపోయాడు. తనలో తాను ఆలోచిస్తూ ఉండేవాడు. ఇంట్లోకి తన తోడు వచ్చాక తన గుడ్ టైమ్ మొదలైంది. అప్పటినుంచి అతడి ఆలోచన విధానం కూడా మారింది. పైనల్లీ లెనిన్ రిజల్ట్ పాజిటివ్‌గా వచ్చింది. ఎస్ అయ్యగారే నెంబర్ వన్.'
'ఎన్నోసార్లు వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లాను. ఎప్పుడూ ఏమీ అడిగింది లేదు. ఈసారి మాత్రం 'మా వాడికి ఒక హిట్ ఇవ్వండి' అని అడిగాను. ముందుగా ఆయనికి కృతజ్ఞతలు. తర్వాత మా పెద్ద పెద్ద అబ్బాయి తారక్‌కి థ్యాంక్స్' అని నాగార్జున చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: అఖిల్ 'లెనిన్' సినిమా రివ్యూ)


