అఖిల్ 'లెనిన్' ట్విటర్ రివ్యూ | Akhil Akkineni Lenin Movie Twitter Review In Telugu, Check These Tweets Inside Before Watching The Film | Sakshi
Sakshi News home page

Lenin Twitter Review: థియేటర్లలోకి 'లెనిన్'.. ప్రేక్షకులు ఏమంటున్నారు?

Jul 10 2026 7:18 AM | Updated on Jul 10 2026 9:20 AM

Akhil Akkineni Lenin Movie Twitter Review

దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత అక్కినేని అఖిల్ చేసిన సినిమా 'లెనిన్'. దాదాపు 11 ఏళ్లుగా పలు మూవీస్ చేసినప్పటికీ సక్సెస్ అనేది అఖిల్‌కి అందలేదు. చివరగా వచ్చిన 'ఏజెంట్' డిజాస్టర్ కావడంతో కాస్త శ్రద్ధ తీసుకుని 'లెనిన్' చేసినట్లు టీమ్ అంతా చెబుతూ వచ్చారు. ఇప్పుడిది థియేటర్లలో రిలీజైపోయింది. మరి చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారు?

తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 5 గంటలకు షోలు పడ్డాయి. ఓవర్సీస్‌లో అంతకు కాసేపటి ముందు షోలు పడ్డాయి. అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫస్టాప్ ఎంగేజింగ్‌గా ఉందని అంటున్నారు. లవ్ స్టోరీ ఓకే ఓకే అనిపించినప్పటికీ మహాభారతం రిఫరెన్స్‌లు వర్కౌట్ అయ్యాయని అంటున్నారు. అఖిల్ కూడా గతంతో పోలిస్తే చాలా మెరుగయ్యాడని, ఇంటర్వెల్ కూడా బాగుందని అంటున్నారు. ఓవరాల్‌గా ఇదో రెగ్యులర్ కమర్షియల్ మూవీలానే ఉందని, కొన్ని ట్విస్టులు ఆకట్టుకున్నాయని చెబుతున్నారు.

(ఇదీ చదవండి: 'ఐ, నోబడీ' మూవీ రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement