అక్కినేని అఖిల్ లెనిన్.. రిలీజ్‌కు ముందే రికార్డ్ | Akkineni Akhil Lenin Movie Creates Non Theatrical Record In Tollywood | Sakshi
Sakshi News home page

Lenin Movie: అక్కినేని అఖిల్ లెనిన్.. రిలీజ్‌కు ముందే రికార్డ్

Jul 7 2026 3:44 PM | Updated on Jul 7 2026 3:51 PM

Akkineni Akhil Lenin Movie Creates Non Theatrical Record In Tollywood

అఖిల్ అక్కినేని హీరోగా వస్తోన్న యాక్షన్ చిత్రం లెనిన్. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీకి మురళి కిశోర్ అబ్బూరి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా రిలీజ్‌ కేవలం మూడు రోజుల సమయ మాత్రమే మిగిలింది. ఇప్పటికే లెనిన్ మూవీ నాన్ థియేట్రికల్ బిజినెస్‌పరంగా కళ్లు చెదిరే ధరను సొంతం చేసుకుంది. ఈ మూవీ కోసం జీ నెట్‌వర్క్ డిజిట‌ల్‌, శాటిలైట్ హ‌క్కుల్ని రూ.19 కోట్ల‌కు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా హిందీ వర్షన్‌కు ఏకంగా రూ.9 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ఇవీ కాకుండా ఆడియో రైట్స్ కోసం టీ సిరీస్‌ మరో రూ.6 కోట్లు ఇవ్వనున్నారని తెలుస్తోంది. 

దీంతో రిలీజ్‌కు ముందే లెనిన్ ఏకంగా రూ.34 కోట్ల వసూళ్లు సాధించినట్లే. ఈ లెక్కన చూస్తే నాన్ థియేట్రిక‌ల్ రూపంలో ఊహించని ధరలను సొంతం చేసుకుంది. ఇప్పుడు మార్కెట్‌ ప్రకారం మిడ్ రేంజ్ సినిమాల‌కు ఓటీటీలు అమ్మ‌డ‌మే క‌ష్ట‌మైన ద‌శ‌లో లెనిన్ భారీ ధరకు అమ్ముడు కావడం విశేషం. అయితే ఈ డీల్స్‌పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్‌, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నిర్మించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement