డిసెంబర్‌లో ‘ఇడుపు కాయితం’! | Idupu Kayitham Movie Latest Update | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌లో ‘ఇడుపు కాయితం’!

Jul 11 2026 3:21 PM | Updated on Jul 11 2026 3:23 PM

Idupu Kayitham Movie Latest Update

తెలంగాణ ఫోక్‌ డ్యాన్సర్‌ నాగదుర్గ, ప్రియదర్శి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వంశీరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బన్నీవాసు, సుకుమార్‌ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది.‘ఇడుపు కాయితం’సినిమా టైటిల్ నేపథ్యంగా సాగిన చర్చ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

టైటిల్ తోనే ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అతి తక్కువ టైమ్ లో మరే చిత్రానికీ లేనంతగా  ఈ సినిమా వార్తల్లో నిలిచింది. దీంతో ప్రేక్షకుల దృష్టిని ఈ సినిమా బాగా ఆకర్షిస్తోంది. సినిమా పూజా కార్యక్రమాల సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. "ఇడుపు కాయితం" త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఈ సినిమాను డిసెంబర్ ఫస్ట్ వీక్ లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రేజీ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో దర్శక నిర్మాతలు షేర్ చేసుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement