ఓటీటీలోకి వచ్చేసిన ఫాంటసీ కామెడీ సినిమా.. తెలుగులోనూ | Double Occupancy Movie OTT Telugu Streaming Now | Sakshi
Sakshi News home page

OTT: పగలు ఆడ.. రాత్రయితే మగాడిలా.. ఓటీటీలో మూవీ స్ట్రీమింగ్

Jul 10 2026 7:57 AM | Updated on Jul 10 2026 7:57 AM

Double Occupancy Movie OTT Telugu Streaming Now

ఓటీటీలోకి ప్రతివారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా పెద్ది, సింగ్ గీతం, పరిమళ అండ్ కో, బల్టీ తదితర చిత్రాలు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. వీటితో పాటు ఓ తమిళ ఫాంటసీ కామెడీ మూవీ కూడా తెలుగులోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఖుష్బూ నిర్మించిన ఈ సినిమా సంగతేంటి? ఎందులో చూడొచ్చు?

(ఇదీ చదవండి: అఖిల్ 'లెనిన్' ట్విటర్ రివ్యూ)

సంతోష్, రేష్మ, వెంకటేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'డబుల్ ఆక్యుపెన్సీ'. అశ్విన్ కందసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నెల 12న తమిళంలో రిలీజైంది. ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

'డబుల్ ఆక్యుపెన్సీ' విషయానికొస్తే.. రజనీ అనే అమ్మాయికి వింత జబ్బు ఉంటుంది. పగలు అమ్మాయిలా ఉండే ఈమె రాత్రయితే అబ్బాయిలా మారిపోతుంది. ఉదయం ఓ బయోటెక్ కంపెనీలో ఉద్యోగం చేసే ఈమె.. రాత్రి ఓ బార్‌లో పనిచేస్తూ ఉంటుంది. అనుకోకుండా ఈమె జీవితంలోకి ఉదయం ఓ అబ్బాయి, రాత్రి ఓ అమ్మాయి వస్తారు. మరి ఈ జండర్ స్వాప్ ప్రేమకథ చివరకు ఏమైంది? అనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: 'ఐ, నోబడీ' మూవీ రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement