ఓటీటీకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్‌.. ఏకంగా 5 ఓటీటీల్లోకి..! | Malayalam Movie Dose Ott Streaming From On This Date and ott | Sakshi
Sakshi News home page

Malayalam Movie: ఓటీటీలో మలయాళ థ్రిల్లర్‌.. ఏకంగా 5 ఓటీటీల్లో స్ట్రీమింగ్..!

Jul 7 2026 8:03 PM | Updated on Jul 7 2026 8:40 PM

Malayalam Movie Dose Ott Streaming From On This Date and ott

ఓటీటీలు వచ్చాక సినిమాలు తెగ చూసేస్తున్నారు. కొత్త కంటెంట్ దొరికితే చాలు భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తున్నారు. ఓటీటీల్లో ముఖ్యంగా మలయాళ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటోంది. తాజాగా మరో మలయాళ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది.  ఇటీవలే రిలీజైన మలయాళ మిస్టరీ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్‌ మూవీ డోస్. ఈ చిత్రానికి అభిలాష్ ఆర్ నాయర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సిజు విల్సన్, జగదీష్, అశ్విన్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు చేశారు మేకర్స్. జూలై 10 నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. అమెజాన్ ప్రైమ్‌తో పాటు సింప్లీ సౌత్, ఆహా తమిళం, మనోరమ మ్యాక్స్, లయన్స్ గేట్ ప్లే ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement