తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. రాజకీయాలకు చిన్న బ్రేక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. ఎందుకంటే సీఎం కాకముందు ఈయన తన చివరి సినిమా చేశారు. అదే 'జన నాయగణ్'. లెక్క ప్రకారం ఈ ఏడాది సంక్రాంతికే రిలీజైపోవాలి. కానీ సెన్సార్ సమస్యల వల్ల ఇప్పటికీ అలా ఉండిపోయింది. ఈనెలలో రిలీజ్ కావొచ్చని రూమర్స్ వినిపిస్తున్న క్రమంలో విజయ్.. అధికారికంగా ఓ అప్‌డేట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
(ఇదీ చదవండి: త్రివిక్రమ్ కొత్తగా ఇంకేం తీస్తాడబ్బా?)
తెలుగు సినిమా 'భగవంత్ కేసరి'కి రీమేక్ అయిన జన నాయగణ్ చిత్రానికి ఎట్టకేలకు సెన్సార్ పూర్తయింది. ఏ సర్టిఫికెట్ వచ్చినట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. దీనిని సీఎం విజయ్.. తన సోషల్ మీడియాలో ఖాతాల్లో పంచుకున్నారు. ఇకపోతే ఈ నెల 24న తెలుగు, తమిళంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. దాదాపు ఇదే తేదీ ఫైనల్ అని కూడా అంటున్నారు.
ఇకపోతే ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా మమిత బైజు కీలక పాత్ర చేసింది. హెచ్. వినోద్ దర్శకుడు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ నిర్మించారు.
(ఇదీ చదవండి: పెళ్లయ్యాక అఖిల్ టైమ్ మొదలైంది: నాగార్జున)
— Vijay (@actorvijay) July 11, 2026


