ప్రభాస్ ఫౌజీ.. భారీ ధరకు ఓటీటీ డీల్..! | Prabhas Fauzi Movie Gets a Record Breaking Ott Deal | Sakshi
Sakshi News home page

Fauzi Movie: ప్రభాస్ ఫౌజీ.. భారీ ధరకు ఓటీటీ డీల్..!

Jul 10 2026 3:05 PM | Updated on Jul 10 2026 3:10 PM

Prabhas Fauzi Movie Gets a Record Breaking Ott Deal

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ మూవీ ఫౌజీ. ఈ మూవీకి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ టాక్ వైరల్‌గా మారింది. ఈ భారీ ప్రాజెక్ట్‌ కోసం బిగ్ డీల్ కుదిరినట్లు టాక్ వినిపిస్తోంది.

భారీ ధరకు డిజిటల్ రైట్స్..

ఈ మూవీని ఓటీటీ డీల్ భారీ ధరకు అమ్ముడైనట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ కోసం ఏకంగా రూ.180 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. సౌతిండియా స్ట్రీమింగ్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ ఈ మొత్తాన్ని చెల్లించనుందని సమాచారం. అంతేకాకుండా హిందీ హక్కులను ఏఏ ఫిల్మ్స్ రూ. 60 కోట్లకు థియేట్రికల్ రైట్స్‌ను దక్కించుకుంది.

అయితే హిందీకి సంబంధించిన ఓటీటీ డీల్ ఇంకా కుదరలేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు కేవలం సౌత్ ఇండియా భాషలకే డీల్ ఓకే చేశారని టాక్. ఈ మూవీలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, జయప్రద, మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.  ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement