‍అది చూసి షాకయ్యా.. పుచ్చకాయ తినడం మానేశా: కాజల్‌ అగర్వాల్ | Kajal Aggarwal Reveals Food adultration in india shocking exeperience | Sakshi
Sakshi News home page

Kajal Aggarwal: ఆ ఘటనతో పుచ్చకాయ తినడం మానేశా: కాజల్‌ అగర్వాల్

Jul 10 2026 2:30 PM | Updated on Jul 10 2026 2:44 PM

Kajal Aggarwal Reveals Food adultration in india shocking exeperience

టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన లేటేస్ట్ మూవీ ది ఇండియా స్టోరీ.  కల్తీ కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు అంతా సిద్ధమైంది. ఈ నెల 24న ది ఇండియా స్టోరీ థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్ తేదీకి ఇంకా రెండు వారాలు మాత్రమే సమయం ఉండడంతో ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది కాజల్ అగర్వాల్. మనదేశంలో ఆహార కల్తీ విపరీతంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతి రోజు మనం తాగే పాకెట్ పాలు మంచివి కావని తెలిపింది. కానీ ప్రతిరోజు అవే అందరూ తాగుతున్నారని.. ఇది చాలా దారుణమని వాపోయింది. ‍‍అసలు ఏది తినాలో.. ఏది తినకూడదో అర్థం కావడం లేదన్నారు.  

అంతేకాకుండా ఆహార కల్తీ వల్లే యువతలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని నటి కాజల్ అగర్వాల్ తెలిపింది. కల్తీపై అవగాహన కల్పిస్తూ ది ఇండియా స్టోరీ మూవీని తీశారని పేర్కొంది. ఓ ప్రాజెక్ట్ రీసెర్చ్‌లో తాను షాకింగ్ విషయాలు తెలుసుకున్నా.. ఇటీవల ఓ కేసు గురించి విని పుచ్చకాయ తినడం మానేశానని కాజల్‌ చెప్పుకొచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement