ఒకప్పటి టాలీవుడ్ అందగాడు, దివంగత హీరో శోభన్ బాబు భార్య శాంతకుమారి(86) గురువారం చనిపోయారు. చెన్నైలో ఉంటున్న ఈమె.. వయసుతో పాటు వచ్చే ఆరోగ్య సమస్యలకు గురికావడంతో కుటుంబ సభ్యులు నాలుగు రోజుల క్రితం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
అయితే గురువారం తనని కలిసేందుకు వచ్చిన స్నేహితురాలితో శాంతకుమారితో మాట్లాడుతూ అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈమె మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు. నివాళి అర్పిస్తున్నారు. ఇకపోతే శోభన్ బాబు.. 2008లో చనిపోయారు.


