ప్రభాస్ ఫౌజీ.. రెబల్ స్టార్ పవర్‌ఫుల్ రోల్..! | Tollywood Hero Prabhas Fauzi Movie latest poster looks goes viral | Sakshi
Sakshi News home page

Fauzi Movie: ప్రభాస్ ఫౌజీ.. రెబల్ స్టార్ పవర్‌ఫుల్ రోల్..!

Jul 20 2026 6:42 PM | Updated on Jul 20 2026 7:08 PM

Tollywood Hero Prabhas Fauzi Movie latest poster looks goes viral

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం ఫౌజీ. ఈ మూవీకి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు.  తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది.  ఇందులో ప్రభాస్‌ ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా కనిపించనున్నారని తెలుస్తోంది. నేతాజీ సుభాశ్ చంద్రబోస్ నాయకత్వంలో భారత స్వాతంత్ర్యం కోసం ఆయన చేసే పోరాటమే ప్రధానంగా తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్ ముందుగా బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో సైనికుడిగా పనిచేసి.. ఆ తర్వాత సుభాశ్ చంద్రబోస్ నేతృత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరుతాడని తెలుస్తోంది. 

ఇది కేవలం నేతాజీ బయోపిక్ మాత్రమే కాదని.. అంతే కాకుండా ఇండియన్‌ ఫ్రీడమ్ కోసం పోరాడిన సైనికుల కథను చూపించే చిత్రంగా ఉండనుందని టాక్‌. ఈ మూవీలో ప్రభాస్‌ పాత్ర ధైర్య సాహసాలు, త్యాగం, దేశభక్తితో నిండి ఉంటుందని సమాచారం. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఈ చిత్రాన్ని డిసెంబరు 3న ఫౌజీ విడుదల కానుందని తాజాగా పోస్టర్‌ను పంచుకుంది.

ఈ పోస్టర్‌లో ఎప్పుడు చూడని లుక్‌లో ప్రభాస్‌ కనిపించారు. దీంతో అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ యాక్షన్‌ మూవీ డిసెంబర్ 3న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ప్రభాస్ ఫౌజీతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో స్పిరిట్ చిత్రంలో కనిపించనున్నారు. ఈ మూవీలో త్రిప్తి దిమ్రీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆ తర్వాత సలార్: పార్ట్ 2, కల్కి 2898 ఏడీ: పార్ట్ 2 సినిమాలు చేస్తున్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement