విలేజ్ స్టైల్లో మెగాహీరో మాస్ పాట | Varun Tej Korean Kanakaraju Movie Song | Sakshi
Sakshi News home page

Korean Kanakaraju Song: 'కొరియన్ కనకరాజు' కొత్త సాంగ్ రిలీజ్

Jul 20 2026 3:00 PM | Updated on Jul 20 2026 7:52 PM

Varun Tej Korean Kanakaraju Movie Song

మెగాహీరోల్లో వరుణ్ తేజ్ ఒకడు. ముకుంద, ఫిదా, తొలిప్రేమ, కంచె లాంటి సినిమాలతో కెరీర్ ప్రారంభంలో సమ్‌థింగ్ డిఫరెంట్ అనిపించుకున్నాడు. తర్వాత నుంచి వరసపెట్టి ఫ్లాప్స్ పడ్డాయి. 2019లో వచ్చిన 'గద్దలకొండ గణేశ్' ఓ మాదిరిగా ఆకట్టుకోగా.. తర్వాత వచ్చిన గని, గాంఢీవదారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్, మాట్కా చిత్రాలు ఒకదానిని మించి మరొకటి డిజాస్టర్స్ అయ్యాయి.

(ఇదీ చదవండి: ఎప్పటికీ నువ్వు నా లిటిల్ స్టార్‌వే.. సితార గురించి మహేశ్)

దీంతో రెండేళ్లు గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ నుంచి వస్తున్న సినిమా 'కొరియన్ కనకరాజు'. వచ్చే నెల 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. వారం క్రితం టీజర్ రిలీజ్ చేయగా పర్లేదనిపించుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు 'రసగుమ్మడి' అంటూ ఓ పాట వదిలారు. విలేజ్ స్టైల్లో సాగే మాస్ బీట్‌తో ఉన్న ఈ గీతం కలర్‌ఫుల్‌గా బాగుంది. తమన్ మ్యూజిక్ వినసొంపుగా ఉంది. ఇకపోతే ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకుడు. రితికా నాయక్ హీరోయిన్.

(ఇదీ చదవండి: అక్క 'జబర్దస్త్' కమెడియన్.. చెల్లి ఏమో రాకెట్ ఇంజినీర్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement