అక్క టాలీవుడ్ కమెడియన్.. చెల్లి ఏమో రాకెట్ ఇంజినీర్ | Jabardasth Satya Sri Sister Is Rocket Scientist | Sakshi
Sakshi News home page

Jabardasth Satya Sri Sister: లేడీ కమెడియన్ చెల్లి సైంటిస్టా? ఫొటోలు వైరల్

Jul 20 2026 2:18 PM | Updated on Jul 20 2026 2:42 PM

Jabardasth Satya Sri Sister Is Rocket Scientist

సాధారణంగా ఎవరైనా సినిమా ఇండస్ట్రీలోకి వస్తే వాళ్ల కుటుంబ సభ్యులు కూడా ఇందులోకి వచ్చేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. దాదాపుగా ఇదే జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మాత్రం కాస్త నటీనటుల కుటుం సభ్యులు.. భిన్నమైన రంగాల్లోకి ప్రవేశించి ఆశ్చర్యపరుస్తుంటారు. 'జబర్దస్త్' ఫేమ్ సత్యశ్రీ చెల్లి కూడా ఇప్పుడు రాకెట్ ప్రయోగంలో భాగమైంది. స్వయంగా ఈమె ఫొటోలు బయటపెట్టడంతో ఈ సంగతి బయటపడింది.

'జబర్దస్త్' షోలో చమ్మక్ చంద్ర కాంబోలో చేసిన సత్యశ్రీ.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటోంది. ఈమె తల్లి కూడా ఒకప్పుడు నటిగా చేసింది. అలా ఇండస్ట్రీతో బాండింగ్ ఉన్న వీళ్ల ఇంటి నుంచి ఓ రాకెట్ ఇంజినీర్ వచ్చింది. ఆమెనే సత్యశ్రీ చెల్లి కీర్తిశ్రీ. ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్ సంస్థ 'స్కైరూట్ ఏరోస్పేస్' ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'విక్రమ్-1' రాకెట్ ప్రయోగంలో కీర్తి శ్రీ కీలక పాత్ర పోషించింది.

శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్ర నుంచి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ 'విక్రమ్-1'.. రీసెంట్‌గా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ చారిత్రక మిషన్‌లో భాగమైన ఇంజినీర్లలో సత్యశ్రీ చెల్లి కీర్తి శ్రీ కూడా ఒకరు. ఈ రాకెట్ కోసం ఏవియానిక్స్ ఇంజనీర్‌గా, ఎలక్ట్రికల్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్ట్ ఇంజనీర్‌గా బాధ్యతలు నిర్వర్తించింది. చెల్లి కీర్తి.. రాకెట్‌తో పాటు ఉన్న ఫొటోలని పంచుకున్న సత్యశ్రీ భావోద్వేగానికి గురైంది.

ఈ రోజు నేను కేవలం ఒక రాకెట్‌ని మాత్రమే చూడటం లేదు. నా చెల్లి కలలు ఆకాశంలోకి ఎగరడాన్ని చూస్తున్నా. 'మిషన్ ఆగమన్' రాకెట్‌పై నా చెల్లి సంతకం చేస్తుంటే ఒక అక్కగా నాకు ఎంతో గర్వంగా ఉంది. చిన్నప్పుడు నక్షత్రాలని వింతగా చూసిన నా చిన్నారి యువరాణి.. ఈ రోజు ఆ నక్షత్రాల వైపు ప్రయాణించే రాకెట్‌ని నిర్మించే స్థాయికి ఎదగడం వెనుక ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ ఉంది అని సత్యశ్రీ రాసుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement