breaking news
Satya Sri
-
అక్క టాలీవుడ్ కమెడియన్.. చెల్లి ఏమో రాకెట్ ఇంజినీర్
సాధారణంగా ఎవరైనా సినిమా ఇండస్ట్రీలోకి వస్తే వాళ్ల కుటుంబ సభ్యులు కూడా ఇందులోకి వచ్చేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. దాదాపుగా ఇదే జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మాత్రం కాస్త నటీనటుల కుటుం సభ్యులు.. భిన్నమైన రంగాల్లోకి ప్రవేశించి ఆశ్చర్యపరుస్తుంటారు. 'జబర్దస్త్' ఫేమ్ సత్యశ్రీ చెల్లి కూడా ఇప్పుడు రాకెట్ ప్రయోగంలో భాగమైంది. స్వయంగా ఈమె ఫొటోలు బయటపెట్టడంతో ఈ సంగతి బయటపడింది.'జబర్దస్త్' షోలో చమ్మక్ చంద్ర కాంబోలో చేసిన సత్యశ్రీ.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటోంది. ఈమె తల్లి కూడా ఒకప్పుడు నటిగా చేసింది. అలా ఇండస్ట్రీతో బాండింగ్ ఉన్న వీళ్ల ఇంటి నుంచి ఓ రాకెట్ ఇంజినీర్ వచ్చింది. ఆమెనే సత్యశ్రీ చెల్లి కీర్తిశ్రీ. ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్ సంస్థ 'స్కైరూట్ ఏరోస్పేస్' ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'విక్రమ్-1' రాకెట్ ప్రయోగంలో కీర్తి శ్రీ కీలక పాత్ర పోషించింది.శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్ర నుంచి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ 'విక్రమ్-1'.. రీసెంట్గా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ చారిత్రక మిషన్‌లో భాగమైన ఇంజినీర్లలో సత్యశ్రీ చెల్లి కీర్తి శ్రీ కూడా ఒకరు. ఈ రాకెట్ కోసం ఏవియానిక్స్ ఇంజనీర్‌గా, ఎలక్ట్రికల్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్ట్ ఇంజనీర్‌గా బాధ్యతలు నిర్వర్తించింది. చెల్లి కీర్తి.. రాకెట్‌తో పాటు ఉన్న ఫొటోలని పంచుకున్న సత్యశ్రీ భావోద్వేగానికి గురైంది.ఈ రోజు నేను కేవలం ఒక రాకెట్‌ని మాత్రమే చూడటం లేదు. నా చెల్లి కలలు ఆకాశంలోకి ఎగరడాన్ని చూస్తున్నా. 'మిషన్ ఆగమన్' రాకెట్‌పై నా చెల్లి సంతకం చేస్తుంటే ఒక అక్కగా నాకు ఎంతో గర్వంగా ఉంది. చిన్నప్పుడు నక్షత్రాలని వింతగా చూసిన నా చిన్నారి యువరాణి.. ఈ రోజు ఆ నక్షత్రాల వైపు ప్రయాణించే రాకెట్‌ని నిర్మించే స్థాయికి ఎదగడం వెనుక ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ ఉంది అని సత్యశ్రీ రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Satya Sri (@me_satyasri) View this post on Instagram A post shared by Satya Sri (@me_satyasri) -
గృహ ప్రవేశం.. పట్టుచీరలో 'జబర్దస్త్' సత్యశ్రీ (ఫొటోలు)
-
పశ్చిమగోదావరి జిల్లా : తణుకు లో గృహప్రవేశం చేసిన జబర్ధస్త్ నటి సత్య శ్రీ (ఫొటోలు)
-
Satya Sri: ఊటీలో చిల్ అవుతున్న జబర్దస్త్ బ్యూటీ (ఫోటోలు)
-
సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘మిస్టరీ’..షూటింగ్ షురు
తల్లాడ సాయికృష్ణ, స్వప్న చౌదరి, సుమన్, అలీ, తనికెళ్ల భరణి, సత్య శ్రీ, దుగ్గిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక పాత్రల్లో ‘మిస్టరీ’ సినిమా షురూ అయింది. తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో పీవీ ఆర్ట్స్ పతాకంపై వెంకట్ పులగం నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ నెల 21 వరకు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది. సింగిల్ షెడ్యూల్లో షూటింగ్‌ని పూర్తి చేస్తాం. సెప్టెంబర్ చివరి వారంలో ‘మిస్టరీ’ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రామ్ తవ్వ, కెమెరా: సుధాకర్, శివ రాథోడ్. పవర్ ఫుల్ పోలీస్‌గా రవిరెడ్డి ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటుడు ‘రవి రెడ్డి’ చేస్తున్నట్లు టీం సభ్యులు తెలిపారు. గతంలో వి, విరాటపర్వం, గాలోడు లాంటి సినిమా లలో తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు రవిరెడ్డి. ఈ చిత్రంలో మంచి పాత్ర పోషిస్తున్నానని, రిలీజ్ తర్వాత మంచి గుర్తింపుతో పాటు అవకాశాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. -
ఆశల హరివిల్లు
‘ఆకాశంలో ఆశల హరివిల్లు.. ఆనందాలే పూసిన పొదరిల్లు’ అంటూ ‘స్వర్ణకమలం’ చిత్రంలో భానుప్రియ చేసిన నృత్యాన్ని అంత సులువుగా మరచిపోలేం. ఆ పాట కూడా పాపులర్ అయింది. తాజాగా ‘ఆకాశంలో ఆశల హరివిల్లు’ పేరుతో ఓ సినిమా తెరకెక్కింది. సత్యశ్రీ, సుబ్బారెడ్డి, చరణ్, శ్రావణి ముఖేష్, నరేష్ ముఖ్య తారలుగా క్రాంతి కిరణ్ దర్శకత్వంలో బి. సత్యశ్రీ నిర్మించారు. శ్రీనివాస్ మాలపాటి స్వరపరచిన ఈ చిత్రం పాటలను నవ్యాంధ్ర ఫిలిం చాంబర్ అధ్యక్షుడు ఎస్విఎన్ రావు, నిర్మాత సాయి వెంకట్ విడుదల చేశారు. క్రాంతి కిరణ్ మాట్లాడుతూ– ‘‘కుటుంబ నేపథ్యంలో తెరకెక్కిన మంచి ప్రేమకథా చిత్రమిది. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నాకీ చాన్స్ ఇచ్చిన సత్యశ్రీగారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘దర్శకుడు, కెమెరామెన్ రెమో, హీరో, హీరోయిన్ల సపోర్ట్ వల్లే ఈ సినిమా తీయగలిగాను.వారికి నా స్పెషల్ థ్యాంక్స్’’ అన్నారు సత్యశ్రీ. -
తప్పు ఒకరిది... శిక్ష వేరొకరికి...
ఓ హోమ్ మినిస్టర్ కొడుకు చేసిన తప్పిదానికి అన్నెం పున్నెం ఎరుగని ఓ జంట ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంది? అనే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం - ‘టెన్షన్ టెన్షన్’. సత్యశ్రీ దర్శకుడు. బంగార్రాజు నిర్మాత. హైదరాబా ద్లో ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి సురేశ్ కొండేటి కెమెరా స్విచాన్ చేయగా, రేలంగి నరసింహారావు క్లాప్ ఇచ్చారు. ‘‘మనిషన్నాక సమస్యలు సాధారణం. వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలో ఇందులో చూపించనున్నాం. నాకు రెండు చేతులూ లేకపోయినా... ఈ సినిమా తీసి నన్ను నేను నిరూపించుకొని పదుగురికి స్ఫూర్తిగా నిలవాలనే కసితో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాను’’ అని దర్శకుడు సత్యశ్రీ అన్నారు.


