ఎనిమిదేళ్ల కష్టం.. విక్రమ్‌–1 విజయం | Naga Bharath Daka Vikram 1 Success Story | Sakshi
Sakshi News home page

ఎనిమిదేళ్ల కష్టం.. విక్రమ్‌–1 విజయం

Jul 20 2026 1:50 PM | Updated on Jul 20 2026 3:04 PM

 Naga Bharath Daka Vikram 1 Success Story

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఎనిమిదేళ్లపాటు అవిశ్రాంతంగా శ్రమించి విక్రమ్‌–1 ప్రాజెక్టు సఫలం కావడానికి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని శాస్త్రవేత్త, స్కైరూట్‌ చీఫ్‌ ఆపరేషనల్‌ ఆఫీసర్‌ నాగభరత్‌ డాకా విజయం సాధించారని ఆయన మావ చావలి శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. 

ఆదివారం ఆయన ఏలూరులో విలేకరులతో మాట్లాడుతూ శ్రీహరికోట సతీష్‌ ధావన్‌ స్పేస్‌ స్టేషన్‌ నుంచి ప్రయోగించిన దేశంలో మొదటి ప్రైవేట్‌ రాకెట్‌ విక్రమ్‌–1 విజయంలో ప్రధాన భూమిక పోషించిన శాస్త్రవేత్త, స్కైరూట్‌ చీఫ్‌ ఆపరేషనల్‌ ఆఫీసర్‌ నాగభరత్‌ డాకా తన అల్లుడని అన్నారు. 

తన ఏకైక కుమార్తె పావనిని 2016లో వివాహం చేసుకున్నారన్నారు. భరత్‌ మ ద్రాసు ఐఐటీలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేశారని, ఆ సమయంలో రూమ్‌మేట్‌ పవన్‌కుమార్‌ చందన (మెకానికల్‌ ఐఐటీ ఖరగ్‌పూర్‌)తో కలిసి స్కైరూట్‌ సంస్థను 2018లో ప్రారంభించారని పేర్కొన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement