breaking news
Skyroot Aerospace
-
ISRO పని ఖతం..? ప్రైవేటీకరణపై బయటకు వస్తున్న సంచలన విషయాలు
-
ఎనిమిదేళ్ల కష్టం.. విక్రమ్–1 విజయం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఎనిమిదేళ్లపాటు అవిశ్రాంతంగా శ్రమించి విక్రమ్–1 ప్రాజెక్టు సఫలం కావడానికి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని శాస్త్రవేత్త, స్కైరూట్ చీఫ్ ఆపరేషనల్ ఆఫీసర్ నాగభరత్ డాకా విజయం సాధించారని ఆయన మావ చావలి శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. ఆదివారం ఆయన ఏలూరులో విలేకరులతో మాట్లాడుతూ శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ స్టేషన్ నుంచి ప్రయోగించిన దేశంలో మొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్–1 విజయంలో ప్రధాన భూమిక పోషించిన శాస్త్రవేత్త, స్కైరూట్ చీఫ్ ఆపరేషనల్ ఆఫీసర్ నాగభరత్ డాకా తన అల్లుడని అన్నారు. తన ఏకైక కుమార్తె పావనిని 2016లో వివాహం చేసుకున్నారన్నారు. భరత్ మ ద్రాసు ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేశారని, ఆ సమయంలో రూమ్మేట్ పవన్‌కుమార్ చందన (మెకానికల్ ఐఐటీ ఖరగ్‌పూర్)తో కలిసి స్కైరూట్ సంస్థను 2018లో ప్రారంభించారని పేర్కొన్నారు. -
నేటి ఈ విజయాన్ని నాడే గుర్తించిన "సాక్షి"
-
నాడు సాక్షి వేదికపై అవార్డు.. నేడు అంతరిక్షంలో రికార్డు
-
చరిత్ర సృష్టించిన స్కైరూట్.. ప్రతిభను ముందే గుర్తించిన ‘సాక్షి’
భారతీయ అంతరిక్ష చరిత్రలో మరో స్వర్ణ అధ్యాయం ఆవిష్కృతమైంది. భారతీయ ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ తొలిసారిగా కక్ష్యలోకి రాకెట్‌ను విజయవంతంగా పంపి చరిత్ర సృష్టించింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్–1 (ఆగమన్) చిన్న ఉపగ్రహ వాహక నౌక శనివారం మధ్యాహ్నం 12.05 గంటలకు ఇస్రోకు చెందిన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.ఈ చారిత్రక విజయంతో భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే, ఈ సంస్థ ప్రతిభను దేశవ్యాప్తంగా గుర్తింపు పొందకముందే ‘సాక్షి’ గుర్తించింది. ప్రతిభను ప్రోత్సహించడం, భవిష్యత్ విజయాలను ముందుగానే గుర్తించడం అనే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ వేదికపై స్కైరూట్ ఏరోస్పేస్ను ‘సాక్షి’ సత్కరించింది. సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2023–24 ఏడాదికి సంబంధించి 2025లో నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో స్కైరూట్‌కు అవార్డు ప్రదానం చేసి, భారత అంతరిక్ష రంగంలో సంస్థ చూపుతున్న వినూత్న కృషిని, సాంకేతిక ప్రతిభను ప్రశంసించింది. ఇప్పుడు విక్రమ్–1 విజయంతో స్కైరూట్ దేశ చరిత్రలో నిలిచిపోగా… ఆ ప్రతిభను ముందుగానే గుర్తించి గౌరవించిన వేదికగా సాక్షి మరోసారి తన దూరదృష్టిని చాటుకుంది.చరిత్ర సృష్టించిన ప్రయోగమిది..ఇస్రో చరిత్రలో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ కాబట్టి శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని ఒక మైలురాయిగా అభివర్ణిస్తున్నారు. స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ విక్రమ్–1 రాకెట్‌ను షార్ నుంచి ప్రయోగించి అంతరిక్ష రంగంలో తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించిన సంస్థగా చరిత్రలో నిలిచిపోయింది. విక్రమ్–1 విజయవంతంగా ప్రయోగించినందుకు స్కైరూట్ సంస్థ సీఈఓ డాక్టర్ పవన్‌కుమార్ చందన, సీఓఓ నాగభరత్ డాకాకు ఇప్పటికే ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగంతో భారత్‌లో ఉన్న 400 స్టార్టప్ కంపెనీల ప్రయత్నాలకు మార్గం సుగమం చేయడంతో పాటు ప్రపంచవ్యాప్త వాణిజ్య అవకాశాలకు ద్వారాలు తెరిచినట్లైంది.విక్రమ్–1 ఇచ్చిన విజయంతో 2030 నాటికి 15 ప్రయోగాలు చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ సీఈవో పవన్‌కుమార్ తెలిపారు. ప్రయోగం విజయవంతం అనంతరం ఆయన మిషన్ కంట్రోల్ సెంటర్లో, ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. 2027 నాటికి విక్రమ్–2 ప్రయోగాన్ని నిర్వహించాలన్న లక్ష్యంతో సంస్థ పనిచేస్తోందన్నారు. ఈ రాకెట్ల ద్వారా పేలోడ్స్ బరువును పెంచుకుంటూ చిన్న తరహా ఉపగ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. వందశాతం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రయోగమిదని.. ఈ విజయం ఇచ్చిన ధైర్యంతో మరిన్ని ప్రయోగాలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు.


