చరిత్ర సృష్టించిన స్కైరూట్.. ప్రతిభను ముందే గుర్తించిన ‘సాక్షి’ | Skyroot Historic Vikram-1 Success, Sakshi Honoured India Private Space Pioneer Before The Record Launch, Watch Video Inside | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన స్కైరూట్.. ప్రతిభను ముందే గుర్తించిన ‘సాక్షి’

Jul 19 2026 1:02 PM | Updated on Jul 19 2026 4:57 PM

Sakshi Recognised Skyroot Before Its Historic Breakthrough

భారతీయ అంతరిక్ష చరిత్రలో మరో స్వర్ణ అధ్యాయం ఆవిష్కృతమైంది. భారతీయ ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ తొలిసారిగా కక్ష్యలోకి రాకెట్‌ను విజయవంతంగా పంపి చరిత్ర సృష్టించింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్–1 (ఆగమన్) చిన్న ఉపగ్రహ వాహక నౌక శనివారం మధ్యాహ్నం 12.05 గంటలకు ఇస్రోకు చెందిన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.

ఈ చారిత్రక విజయంతో భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే, ఈ సంస్థ ప్రతిభను దేశవ్యాప్తంగా గుర్తింపు పొందకముందే ‘సాక్షి’ గుర్తించింది. ప్రతిభను ప్రోత్సహించడం, భవిష్యత్ విజయాలను ముందుగానే గుర్తించడం అనే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ వేదికపై స్కైరూట్ ఏరోస్పేస్‌ను ‘సాక్షి’ సత్కరించింది. సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2023–24 ఏడాదికి సంబంధించి 2025లో నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో స్కైరూట్‌కు అవార్డు ప్రదానం చేసి, భారత అంతరిక్ష రంగంలో సంస్థ చూపుతున్న వినూత్న కృషిని, సాంకేతిక ప్రతిభను ప్రశంసించింది. ఇప్పుడు విక్రమ్–1 విజయంతో స్కైరూట్ దేశ చరిత్రలో నిలిచిపోగా… ఆ ప్రతిభను ముందుగానే గుర్తించి గౌరవించిన వేదికగా సాక్షి మరోసారి తన దూరదృష్టిని చాటుకుంది.

చరిత్ర సృష్టించిన ప్రయోగమిది..
ఇస్రో చరిత్రలో మొట్టమొదటి ప్రైవేట్‌ రాకెట్‌ కాబ­ట్టి శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని ఒక  మైలు­రాయి­గా అభివర్ణిస్తున్నారు. స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సంస్థ విక్రమ్‌–1 రాకెట్‌ను షార్‌ నుంచి ప్రయోగించి అంతరిక్ష రంగంలో తొలి ప్రైవేట్‌ రాకెట్‌ ప్రయోగాన్ని నిర్వహించిన సంస్థగా చరిత్రలో నిలిచిపోయింది. విక్రమ్‌–1 విజయవంతంగా ప్రయోగించినందుకు స్కైరూట్‌ సంస్థ సీఈఓ డాక్టర్‌ పవన్‌కుమార్‌ చందన, సీఓఓ నాగభరత్‌ డాకాకు ఇప్పటికే ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగంతో భారత్‌లో ఉన్న 400 స్టార్టప్‌ కంపెనీల ప్రయత్నాలకు మార్గం సుగమం చేయడంతో పాటు ప్రపంచవ్యాప్త వాణిజ్య అవకాశాలకు ద్వారాలు తెరిచినట్లైంది.

నాడు సాక్షి వేదికపై అవార్డు.. నేడు అంతరిక్షంలో రికార్డు

విక్రమ్‌–1 ఇచ్చిన విజయంతో 2030 నాటికి 15 ప్రయోగాలు చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సంస్థ సీఈవో పవన్‌కుమార్‌ తెలిపారు. ప్రయోగం విజయవంతం అనంతరం ఆయన మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌లో, ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. 2027 నాటికి విక్రమ్‌–2 ప్రయోగాన్ని నిర్వహించాలన్న లక్ష్యంతో సంస్థ పనిచేస్తోందన్నారు. ఈ రాకెట్‌ల ద్వారా పేలోడ్స్‌ బరువును పెంచుకుంటూ చిన్న తరహా ఉపగ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. వందశాతం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రయోగమిదని.. ఈ విజయం ఇచ్చిన ధైర్యంతో మరిన్ని ప్రయోగాలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement