తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగ, ప్రతీకారంతో కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయట్లేరని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లాలో హరీశ్ రావు మాట్లాడుతూ... కేసీఆర్ తిట్టడమే పనిగా రేవంత్ రెడ్డి పెట్టుకున్నారని చెప్పారు.
‘‘ఈ కరవు కాలం తెచ్చిన కరవు కాదు. కాంగ్రెస్ తెచ్చిన కరువు. కేసీఆర్‌ను తిడితే నీళ‍్లు వస్తాయా? నీళ్లు ఎత్తి పోస్తే నీళ‍్లు వస్తాయా? మోటార్లు ఆన్ చేస్తే నీళ్ఉల వస్తాయి అని రిటైర్డ్ ఇంజినీర్లు చెబితే బెల్టుతో కొడతా అని అంటారు రేవంత్. నువ్వు ముఖ్యమంత్రివా.. హిట్లార్‌వా?
కాళేశ్వరం కూలింది అని అంటున్నారు..పోయిన సారీ నీళ్లు వచ్చాయా లేదా? 70 టీఎంసీల నీళ్లు ఎత్తకుండా కిందికి వదిలేశారు. రేవంత్ రెడ్డి వెంటనే కాళేశ్వరం మోటార్లు ఒత్తాలి. రేవంత్ వచ్చాక రాష్ట్రం అంత కరవే. మనకు కరవు.. కాంగ్రెస్ వాళ్లు మాత్రం బాగా దొడ్డు అవుతున్నారు.
రేవంత్ నువ్వు నీళ్లు ఎత్తి రంగనాయక, మల్లన్న, కొండపోచ్చమ్మకు కోపం వస్తే మాడి మసి అయితవు. బీఆర్ఏస్ హయాంలో బోర్ బండ్లు లేవు.. కాంగ్రెస్ హయంలో మళ్లీ బోర్ బండ్లు ఊర్లలోకి వస్తున్నాయి. అనాడు కేసీఆర్ రైతుల పాలిట ఆపద్బాంధవుడుగా ఉంటే...ఇప్పుడు రేవంత్ రాక్షసుడిలా ఉన్నారు.
ఈ స్కాంల ప్రభుత్వం పోవాలి..స్కీమ్ ల ప్రభుత్వం బీఆర్ఏస్ రావాలి అని ప్రజలు అంటున్నారు. కాంగ్రెస్ వచ్చాక ఖమ్మంలో పెద్దావగు కొట్టుకుపోయింది.. వట్టేం మునిగిపోయింది..సుంకిశాల కూలిపోయింది’’ అని చెప్పారు.


