విజయవాడలో మళ్లీ ‘కాల్ మనీ’ కలకలం | Vijayawada Call Money Case, Man Claims He Repaid ₹1.96 Crore, Appeals For Police Protection | Sakshi
Sakshi News home page

విజయవాడలో మళ్లీ ‘కాల్ మనీ’ కలకలం

Jul 19 2026 4:18 PM | Updated on Jul 19 2026 5:27 PM

Call Money Harassment Returns To Vijayawada

సాక్షి, విజయవాడ: నగరంలో మరోసారి కాల్‌ మనీ వ్యాపారులు రెచ్చిపోయారు. కాల్ మనీ వ్యాపారీ ద్వారా మోసపోయానంటూ న్యాయం కోసం బాధితుడు రోడ్డెక్కాడు. 96 లక్షల అప్పుకు కోటి 96 లక్షలు కట్టానని బాధితుడు మోతే గోపరాజు చెబుతున్నాడు. కోటి 96 లక్షలు వడ్డీకే సరిపోయాయని.. 96 లక్షలు కట్టాలంటూ బెదిరిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘లక్షకు రోజుకు 500 వడ్డీతో 96 లక్షలు అప్పు తీసుకున్నాను.. 96 లక్షలకు గాను కోటి 96లక్షలు ఇప్పటివరకు కట్టాను.. ఏప్రిల్ 11వ తేదీన కొంతమంది కుర్రవాళ్లతో బెదిరించారు. నా భార్యతో ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్స్‌పై సంతకాలు తీసుకున్నారు. ఇంకా డబ్బులు కట్టకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని బెదిరించారు. అధికార పార్టీకి చెందిన నేతలు తన వెనుక ఉన్నారని బెదిరించడం ప్రారంభించారు.

..మే నెలలో పెనమలూరు స్టేషన్‌లో నాపై సుంకరసాయి అనే వ్యక్తి కేసు పెట్టారు. 6 సార్లు పెనమలూరు స్టేషన్‌కి వెళ్లి వివరాలు అన్ని ఇచ్చాను. పోలీస్ స్టేషన్‌లో పోలీసులు నన్నే బెదిరించారు. కోటి 96 లక్షలు వడ్డీకే సరిపోయాయి. 96 లక్షలు కట్టాలని పోలీసులు బెదిరించారు. చంద్రబాబుకు, డీజీపీకి లేఖ రాశాను. కాల్‌ మనీ వ్యాపారుల నుంచి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలి’’ అని బాధితుడు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement