వైఎస్‌ జగన్‌ ఉదారతకు ఏపీ ఎంఆర్‌పీఎస్‌ కృతజ్ఞతలు | AP MRPS Expressed Gratitude For YS Jagan Mohan Reddy's Generosity | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ ఉదారతకు ఏపీ ఎంఆర్‌పీఎస్‌ కృతజ్ఞతలు

Jul 20 2026 9:49 AM | Updated on Jul 20 2026 10:03 AM

AP MRPS Expressed Gratitude For YS Jagan Mohan Reddy's Generosity

క్రాంతి కుమార్‌ కుటుంబాన్ని పరామర్శించి, రూ. 10 లక్షల ఆర్థిక సాయం 

సాక్షి, అమరాతి: మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉదారతకు ఏపీ ఎంఆర్‌పీఎస్‌ కృతజ్ఞతలు తెలిపింది. ఆదివారం ఏపీ ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణ రాజు మాట్లాడుతూ.. విజయవాడ కృష్ణలంక సీఐ అరాచకానికి, వేధింపులకు బలై నిండు ప్రాణాన్ని కోల్పోయిన దళిత యువకుడు పేరు పోగు క్రాంతి కుమార్‌ కుటుంబాన్ని పరామర్శించి, రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. క్రాంతి కుమార్‌ కుమారుడి కాలు ఆపరేషన్‌కు అయ్యే మొత్తం వైద్య ఖర్చులను భరిస్తూ, ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచినందుకు వారికి ఏపీ ఎంఆర్‌పీఎస్‌ రుణపడి ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement