క్రాంతికుమార్‌ కుటుంబానికి అండగా వైఎస్సార్‌సీపీ | YS Jagan Extends Support to Kranti Kumar’s Family, Announces ₹10 Lakh Financial Aid After Tragic Incident In Vijayawada | Sakshi
Sakshi News home page

క్రాంతికుమార్‌ కుటుంబానికి అండగా వైఎస్సార్‌సీపీ

Jul 19 2026 10:45 AM | Updated on Jul 19 2026 1:19 PM

Ysrcp Provides 10 Lakh Financial Aid To Kranthi Kumar Family

సాక్షి, విజయవాడ: పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది. కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులు తాళలేక కాంత్రికుమార్‌ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. జూలై 2న క్రాంతి కుమార్ కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. క్రాంతి కుమార్ కుటుంబానికి అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు.

క్రాంతి కుమార్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ఈ మేరకు 10 లక్షల రూపాయల చెక్‌ను కాంత్రికుమార్‌ కుటుంబసభ్యులకు వైఎస్సార్‌సీపీ నేతలు అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, మల్లాది విష్ణు, మొండితోక జగన్మోన్‌రావు, మాజీ ఎంపీ నందిగామ సురేష్.. క్రాంతికుమార్‌ ఇంటికి వెళ్లి చెక్‌ అందించారు.

చంద్రబాబు ఎందుకు న్యాయం చేయలేదు?: టీజేఆర్‌
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్ తన మానవతా హృదయం చూపించారు. పేరుపొగు కుటుంబాన్ని ఆదుకున్నారు. ఇది సామాజిక బాధ్యత. క్రాంతి కుమార్‌ని గంజాయి, డ్రగ్స్ అమ్మాలని, మర్డర్ చేయాలంటూ సీఐ వేధించాడు. క్రాంతి కుమార్ ఆవేశ పూరిత నిర్ణయంతో ముగ్గురు రోడ్డు మీద పడ్డారు. పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబానికి ఎందుకు చంద్రబాబు న్యాయం చేయలేదు?

..వైఎస్‌ జగన్.. క్రాంతి కుమార్ కుటుంబానికి రూ. 10 లక్షలు ఇచ్చారు. పేరూపొగు కుటుంబాన్ని వైఎస్‌ జగన్ పరామర్శించిన తర్వాత ఎస్సీ,ఎస్టీ  కేసు పెట్టారు. రాజ్యాగం ప్రకారం రావాల్సిన బెనిఫిట్స్ కూడా ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదు. దళితులను ఉచకోత కొస్తున్నారు. చంద్రబాబు దళితుల్లో పుట్టాలని ఎవరు అనుకొంటారంటూ అన్నాడు.’’ అని టీజేఆర్‌ గుర్తు చేశారు.

రెడ్‌బుక్ రాజ్యాంగంలో ఇలాగే..: మొండితోక జగన్మోహన్‌రావు
మొండితోక జగన్‌మోహన్‌ రావు మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్ రాజకీయ కోణంలో కాకుండా మానవత కోణంలో సాయం చేశారు.. ప్రభుత్వం తుతూ మంత్రంగా వ్యవహరించింది. సాయికృష్ణ బూడిద కూడా ఇవ్వని పరిస్థితి. గుంటూరులో మహిళను వివస్త్రని చేస్తే ముడు రోజుల వరకు బయటకు రాలేదు. హోమంత్రి ఏం చేస్తున్నారు? ఐటీడీపిలో పని చేసిన వ్యక్తి మంచోడు మణిరత్నంపై కూడా దాడి చేసి కొట్టారు. నందిగామలో టీడీపీ నేత పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోబోయడు. పాము తన పిల్లలను తినేటట్లు టీడీపీ నేతలు తమ కార్యకర్తలనుని వదలడం లేదు. శాంతిభద్రతాలను కాపాడాల్సిన ప్రభుత్వం దాడులకు దిగుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇలాగే జరుగుతుంది.

ఆర్థిక సాయమే కాదు.. ఆరోగ్య భరోసా కూడా: నందిగామ సురేష్‌ 
మాజీ ఎంపీ నందిగామ సురేష్ మాట్లాడుతూ.. ఆర్థిక సహాయమే కాదు.. ఆరోగ్య భరోసా కూడా అందించాం. హోం మంత్రి కనీసం కుటుంబాన్ని పరామర్శించలేదు. చంద్రబాబు మొదటి నుండి దళితులను చిన్న చూపు చూస్తాడు. లోకేష్ పెత్తనం తీసుకొన్న తర్వాత మరింత విచ్చలవిడిగా దారుణాలు పెరిగాయి. రాష్టాన్ని దోచుకొని విదేశాల్లో దాచుకొంటున్నారు. సాయికృష్ణ, క్రాంతి కుమార్ అంశాల్లో వైఎస్‌ జగన్ వచ్చిన తర్వాతనే ప్రభుత్వం స్వందించింది..

దళితులంటే చంద్రబాబుకి చిన్న చూపు: దేవినేని అవినాష్‌
10 లక్షలు ఇచ్చి.. క్రాంతి కుమార్ కుటుంబానికి జగన్ భరోసా ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న క్రాంతి కుమార్ చిన్న కుమారుడికి విజయవాడలో టెస్ట్‌లు చేసి హైదరాబాద్ పంపుతున్నారు. ఏ కష్టం వొచ్చిన నేనున్నాను అని చెప్పే వ్యక్తి జగన్. దళితులు అంటే చంద్రబాబుకి చిన్న చూపు. కూటమి ప్రభుత్వం నిజ స్వరూపం ప్రజలు తెలుసుకొంటున్నారు. పరిపాలన ఎలా చేయాలో జగన్‌ని చూసి నేర్చుకోవాలి.

వైఎస్‌ జగన్‌కి కృతజ్ఞతలు: క్రాంతి కుమార్ తండ్రి 
క్రాంతి కుమార్ తండ్రి పేరుపోగు వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. క్రాంతి కుమార్ విషయంలో వైస్సార్‌సీసీ సత్వరమే స్పందించింది. వైఎస్‌ జగన్ ఇంటికి వచ్చి భరోసా ఇచ్చారు. 10 లక్షలు పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చారు. వైఎస్‌ జగన్‌కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement