జపాన్ ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత షట్లర్, తెలుగుతేజం పీవీ సింధుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 'ఎక్స్' వేదికగా అభినందనలు తెలిపారు. జగన్ స్పందిస్తూ.. 'జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారత మహిళా షట్లర్‌గా రికార్డులకెక్కి, తన కెరీర్‌లో మరో కిరీటాన్ని చేర్చుకున్న సింధుకు అభినందనలు. మీ ప్రదర్శన భారతదేశానికి గర్వకారణం. భవిష్యత్తులో సింధు మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా' అని ట్వీట్ చేశారు.
జపాన్ ఓపెన్ సూపర్-750 టోర్నీ విజేతగా పీవీ సింధు నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 21-17, 21-17తో అకానె యమగూచిపై రెండు వరుస గేముల్లో విజయం సాధించింది. కాగా సింధుకు ఇదే తొలి జపాన్ ఓపెన్ టైటిల్ కావడం విశేషం. సింధుకు ఇదే తొలి జపాన్ ఓపెన్ టైటిల్ కాగా భారత్ తరఫున జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి క్రీడాకారిణిగా ఆమె రికార్డులకెక్కింది. కొంతకాలంగా సరైన ఫామ్‌లేమితో సతమతమవుతున్న సింధు 19 నెలల తర్వాత ఒక మేజర్ టోర్నీ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది.
Congratulations to PV Sindhu on adding one more crown to her illustrious career by becoming the first Indian woman shuttler to win the Japan Open title. A proud moment for India. Wishing her many more glorious victories ahead.@Pvsindhu1
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 19, 2026


