కాకినాడ: ఓ ఇంటి ఆవరణలోకి చొరబడిన తాచుపామును ఓ శునకం వెంటాడి చంపింది. కొత్తపల్లిలో ఉల్లి శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో కలసి నివాసం ఉంటున్నారు. తన ఇంటి ఆవరణలోకి శనివారం గోధుమ రంగు తాచుపాము ప్రవేశించింది. దీనిని వారి పెంపుడు శునకం పసిగట్టింది.
ఇంటి ఆవరణ నుంచి లోపలకు వెళుతున్న ఆ పామును శునకం బెదిరించేందుకు ప్రయత్నించగా, పాము తిరగబడి శునకం మూతిపై కాటు వేసింది. కాటువేసిన కోపంలో శునకం పామును వెంటాడి హతమార్చింది. శునకం నీరసంగా ఉండటంతో శ్రీనివాస్, అతని సోదరుడు సురేష్‌లు కాకినాడకు తీసుకెళ్లి వైద్యం చేయించారు.


