సాక్షి,అమరావతి: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుప్రమాదాన్ని కక్షసాధింపు కోసం వాడుకోవడంపై ఫైరయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం నీచంగా దిగజారిపోయిందని సీదిరి అప్పలరాజు చేసిన తప్పేంటని చంద్రబాబు అరాచకాలను ప్రశ్నించడమా? పలాస ప్రజల తరపున నిలబడడమా? డాక్టర్‌గా మంచి పేరు సంపాదించి సేవ చేయడమా? చంద్రబాబు తన రాజకీయ అజెండాను ఎల్లో మీడియాతో రాయించడం... ఆ తర్వాత పోలీసులు దాన్ని కేసుగా మార్చడం రాష్ట్రంలో అమలవుతున్న కొత్త చట్టవ్యవస్థ ఇదే? అని ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్‌జగన్ మాట్లాడుతూ... సీదిరి అప్పలరాజు కుమారుడు కేవలం 18 ఏళ్ల కుర్రాడని బైక్ నడుపుతూ ప్రమాదానికి కారకుడయ్యాడన్న ఆరోపణలపై యాక్సిడెంట్‌కు సంబంధించిన చట్టాలు కాకుండా ఏకంగా హత్యానేరం అభియోగాలు మోపి అరెస్టు చేశారు. ఆ పిల్లాడిని రిమాండ్‌కు పంపడం.. ఇప్పుడు ఏకంగా తన తండ్రిని కూడా అరెస్టు చేయడం. ఇవన్నీ చూస్తే ఆయనను రాజకీయంగా వేదించడమే చంద్రబాబు టార్గెట్‌గా మారింది. అని వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీదిరి అప్పలరాజు సామాన్య మత్స్యకార కుటుంబం నుంచి తన సొంత ప్రతిభతో ఎదిగిన వ్యక్తి. చదువుల్లో రాణించి వైద్యుడిగా ఎదిగి, ఎంతోమందికి వైద్యసేవలు అందించి ప్రాణాలు కాపాడారన్నారు. వైఎస్సాఆర్‌సీపీ తరఫున ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిగా ప్రజలకు సేవలందించారు. అలాంటి వ్యక్తిని తప్పుడు అభియోగాలతో నేరస్తుడిగా చిత్రీకరించాలని చూడటం అత్యంత దుర్మార్గమన్నారు.
ఒక 18 ఏళ్ల పిల్లాడు, బైక్ నడుపుతూ పొరపాటున గొర్రెలకాపరిని ప్రమాదవశాత్తూ యాక్సిడెంట్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో, దురదృష్టవశాత్తూ ఆ వ్యక్తి మరణానికి గురైతే అది హత్య ఎలా అవుతుంది? ఒక 18 ఏళ్ల పిల్లాడు పొరపాటున చేసిన యాక్సిడెంట్‌కు, తన తండ్రికి ఎలా సంబంధం ముడిపెడతారు?, ఇది అన్యాయం కాదా? అని ప్రశ్నించారు
కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులతో వైఎస్సార్సీపీ నేతలను భయపెట్టలేదని . ప్రజల కోసం పోరాడే ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు పార్టీ పూర్తి అండగా నిలుస్తుందన్నారు. చంద్రబాబూ.. అధికారం శాశ్వతం కాదు. ఇవాళ మీరు పెడుతున్న ప్రతి తప్పుడు కేసు, చేయిస్తున్న ప్రతి అక్రమ అరెస్టు, అధికార దుర్వినియోగం.. వీటన్నింటినీ ప్రజలు సహించబోరు, మీకు తప్పక గుణపాఠం చెప్తారు. అని కూటమి ప్రభుత్వానికి వైఎస్ జగన్ హెచ్చరికలు జారీ చేశారు.


