సాక్షి, అమరావతి: నటి కాదంబరి జత్వాని కేసు వ్యవహారంలో చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. జత్వానీని అడ్డం పెట్టుకొని చంద్రబాబు చేసిన పాపాలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. జత్వానీ కేసు వ్యవహారంపై బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు.
పారిశ్రామికవేత్త కుక్కల నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, అనంతరం కోర్టు అనుమతితో జత్వానిని అరెస్టు చేశారు. ఫిర్యాదు రిజిస్టర్ చేశాకే యాక్షన్‌లోకి వెళ్లాలి. చంద్రబాబు వచ్చాక జత్వాని చేత ఫిర్యాదు చేసి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేయించారు.
జత్వానీ కేసులో చంద్రబాబు, ఎల్లోమీడియా చేసినదంతా విష ప్రచారమని తేలింది. సీఐడీ ఛార్జిషీటులోనే జత్వానీనే దోషి అని ఉంది. ఇంతకాలం అన్యాయంగా, అక్రమంగా తప్పుడు ప్రచారం చేశారు. పోలీసులను అడ్డు పెట్టుకుని ఎంత దుర్మార్గం చేయాలనుకున్నా కుదరదు. జత్వానీ కేసుతో చంద్రబాబు కక్ష సాధింపులకు దిగారు.
అన్యాయంగా ముగ్గురు ఐపిఎస్ అధికారులను సస్పెండ్ చేశారు.ఒక తప్పుడు పని చేసే ముందు చంద్రబాబు ఆర్గనైజ్డ్‌గా కథ నడిపిస్తారు. ముందుగా ఎల్లోమీడియాలో విషప్రచారం చేయిస్తారు. ఆ తర్వాత చంద్రబాబు రంగంలోకి దిగుతారు. అనంతరం లోకేష్, హోంమంత్రి కూడా ఒక ప్లాన్ ప్రకారం మాట్లాడారు. జత్వానీని ఒక గెస్టుహౌసులో కొద్దిరోజుల పాటు నిర్బంధించినట్టు కూడా తప్పుడు ప్రచారం చేశారు.చివరికి జత్వానీ కూడా ఈ ప్రచారాన్ని ఖండించినట్టు సీఐడీ ఛార్జిషీట్‌లో చెప్పారు. చంద్రబాబు జీవితం అంతా అన్యాయమైన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు తయారు చేసిన మహిళా సంఘాలు రోడ్డెక్కాయి.జత్వానీని పరామర్శించినట్టు డ్రామా చేశారు
పీఎస్ఆర్ ఆంజనేయులు లాంటి సిన్సియర్ అధికారిని అరెస్టు చేసి జైలులో వేశారు .సక్రమంగా డ్యూటీ చేస్తే ఇంతగా వేధిస్తారా?.జత్వానీని చిత్రహింసలు పెట్టినట్టు ఎల్లోమీడియా తప్పుడు వార్తలు రాసింది.వ్యవస్థలను తప్పుడు దారిలో నడిపించటం చంద్రబాబుకు అలవాటు. ఆరోజు తప్పుడు వార్తలు రాసిన ఎల్లోమీడియా ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ఐపీఎస్ అధికారులను వేధించిన చంద్రబాబు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు?.
రానున్న కాలంలో వీటంన్నింటికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. సాయికృష్ణ కేసులో కూడా పోలీసు ఉన్నతాధికారులను తప్పించారు. సీఐ నాగరాజుతోనే కేసు ముగించాలని చూస్తే కుదరదు.డీజీపీ నుండి సీపీ రాజశేఖర్ బాబు వరకు అందరి ప్రమేయం బయటకు వస్తుందని స్పష్టం చేశారు.


