breaking news
Fight for AP Special Status
-
కాటేసిన తాచుపాముపై శునకం ప్రతీకారం..!
కాకినాడ: ఓ ఇంటి ఆవరణలోకి చొరబడిన తాచుపామును ఓ శునకం వెంటాడి చంపింది. కొత్తపల్లిలో ఉల్లి శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో కలసి నివాసం ఉంటున్నారు. తన ఇంటి ఆవరణలోకి శనివారం గోధుమ రంగు తాచుపాము ప్రవేశించింది. దీనిని వారి పెంపుడు శునకం పసిగట్టింది. ఇంటి ఆవరణ నుంచి లోపలకు వెళుతున్న ఆ పామును శునకం బెదిరించేందుకు ప్రయత్నించగా, పాము తిరగబడి శునకం మూతిపై కాటు వేసింది. కాటువేసిన కోపంలో శునకం పామును వెంటాడి హతమార్చింది. శునకం నీరసంగా ఉండటంతో శ్రీనివాస్, అతని సోదరుడు సురేష్‌లు కాకినాడకు తీసుకెళ్లి వైద్యం చేయించారు. -
అంపైర్ తో కోహ్లి ఫైట్.. రెండు మ్యాచ్ లు నిషేధం!
-
కోట్ల మంది గొంతుక
-
టీడీపీలా వైఎస్సార్సీపీ డ్రామాలు ఆడటం లేదు


