అఫీషియల్‌: యశ్‌ టాక్సిక్‌.. పెద్దలకు మాత్రమే! | Official: Yash’s Toxic Is For Adults Only! | Sakshi
Sakshi News home page

అఫీషియల్‌: యశ్‌ టాక్సిక్‌.. పెద్దలకు మాత్రమే!

Jul 23 2026 11:03 AM | Updated on Jul 23 2026 11:13 AM

Official: Yash’s Toxic Is For Adults Only!

కేజీఎఫ్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ స్టార్‌ హీరో యశ్‌.. ఇప్పుడు ‘టాక్సిక్‌’తో మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్‌ కంటెంట్‌లో వయొలెన్స్‌, గన్స్‌, స్టైలిష్‌ యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో పాటు బోల్డ్‌ టచ్‌ ఉన్న సన్నివేశాలు, గ్లామరస్‌ పాటలు సినిమాపై ఆసక్తితో పాటు చర్చకు కూడా కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం పూర్తిగా పెద్దలకు మాత్రమే అనే క్లారిటీ వచ్చేసింది. 

యశ్‌ టాక్సిక్‌పై ఆ నిర్మాత వెంకట్‌ కె. నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘టాక్సిక్‌: ఏ ఫెయిరీటేల్‌ ఫర్‌ గ్రోన్‌-అప్స్‌’ పెద్దల కోసం రూపొందించిన సినిమా అని స్పష్టం చేశారు. యశ్‌ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సాధారణ కమర్షియల్‌ సినిమా కాదని నిర్మాత తెలిపారు. కథ చెప్పే విధానం, విజువల్స్‌, సినిమా స్థాయి అన్నీ ప్రత్యేకంగా ఉంటాయని చెప్పారు. థియేటర్లలో ప్రేక్షకులు ఈ సినిమాను వంద శాతం ఆస్వాదిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

“టాక్సిక్‌ చాలా అంబిషియస్‌ ప్రాజెక్ట్‌. దీని స్కేల్‌, గ్రాండియర్‌, కథన శైలి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ప్రేక్షకులు థియేటర్లలో చూసిన తర్వాత మేము చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకుంటారు. అయితే ఇది పూర్తిగా పెద్దలకు మాత్రమే కంటెంట్‌తో నిండిన చిత్రం” అని నిర్మాత వెంకట్‌ కె. నారాయణ పేర్కొన్నారు.

ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్లు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా గ్లామర్‌, డార్క్‌ టోన్‌, యాక్షన్‌ ఎలిమెంట్స్‌ ఎక్కువగా కనిపించడంతో ఈ సినిమా ఏ జానర్‌లో ఉండబోతోందన్న చర్చ మొదలైంది. కొందరు అభిమానులు గ్యాంగ్‌స్టర్‌ బ్యాక్‌డ్రాప్‌లో భారీ యాక్షన్‌ ఉంటుందని అంచనా వేస్తుండగా.. మరికొందరు దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ తనదైన శైలిలో కొత్త అనుభూతిని అందించబోతున్నారని భావిస్తున్నారు.

తండ్రీకొడుకుల మధ్య సంఘర్షణ నేపథ్యంలో ఈ కథ సాగుతుందని సమాచారం. యాక్షన్‌తో పాటు భావోద్వేగాలు, డ్రామా, మానవ సంబంధాలను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నో వాయిదాల తర్వాత యశ్‌ ‘టాక్సిక్‌’ రిలీజ్‌ డేట్‌ ఖరారైంది. 2026 ఆగస్టు 26న ఈ భారీ యాక్షన్‌ డ్రామా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement