ఎప్పటికీ నువ్వు నా లిటిల్ స్టార్‌వే.. సితార గురించి మహేశ్ | Mahesh Babu Wishes His Daughter Sitara On Her Birthday | Sakshi
Sakshi News home page

Mahesh Babu Sitara: సితార పుట్టినరోజు.. మహేశ్ స్పెషల్ ఫొటో

Jul 20 2026 1:15 PM | Updated on Jul 20 2026 2:43 PM

Mahesh Babu Wishes His Daughter Sitara On Her Birthday

టాలీవుడ్ హీరో మహేశ్ బాబు ముద్దుల కూతురు సితార.. 14వ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంది. ఈ క్రమంలోనే మహేశ్ ఓ స్పెషల్ ఫొటో పంచుకుని ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడిది అభిమానులని ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఈ పిక్ వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

'నువ్వు ఎంత ఎదిగినా సరే ఎప్పటికీ నా లిటిల్ స్టార్‌వే. పుట్టినరోజు శుభాకాంక్షలు సితార. రాబోయే ఏడాది అద్భుతంగా ఉండాలని అనుకుంటున్నా. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను' అని మహేశ్ బాబు, సితార గురించి రాసుకొచ్చాడు.

మహేశ్ బాబుతో పాటు తల్లి నమ్రత, అన్నయ్య గౌతమ్ కూడా సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెద్దయ్యాక హీరోయిన్ అవుతానని చాన్నాళ్ల క్రితమే చెప్పిన సితార.. అందుకు తగ్గట్లే యాక్టింగ్, డ్యాన్స్ నేర్చుకునే పనిలో ఉంది. ఇప్పటికే సాంగ్స్, యాడ్ షూట్స్ చేసింది.

(ఇదీ చదవండి: 'ఒడిస్సీ'లో చూపించినవి నిజమైన లొకేషన్లే.. ఏది ఎక్కడంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement