జాతీయ వేదికపై సత్తాచాటిన హీరో రాగ్ మయూర్‌ | Rag Mayur Shines On National Stage | Sakshi
Sakshi News home page

జాతీయ వేదికపై సత్తాచాటిన హీరో రాగ్ మయూర్‌

Jul 20 2026 11:54 AM | Updated on Jul 20 2026 12:38 PM

Rag Mayur Shines On National Stage

ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా, మట్టి వాసన వెదజల్లే పాత్రలతో మెప్పిస్తున్న మన తెలుగు నటులు నేడు జాతీయ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తున్నారు. తనదైన సహజ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న యువ నటుడు రాగ్ మయూర్‌.. ముంబై వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక 'నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్' వేడుకలో ఉత్తమ నటుడిగా అవార్డు సొంతం చేసుకున్నాడు. అమెజాన్ ఒరిజినల్ అయిన 'సివరపల్లి' వెబ్ సిరీస్‌లో ఆయన పోషించిన పాత్రకు ఈ గుర్తింపు లభించింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

దేశవ్యాప్తంగా సినీరంగంలో ఉన్న ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో రాగ్ మయూర్ సందడి చేశారు. బాలీవుడ్ దిగ్గజ నటులు మనోజ్ బాజ్‌పేయి, బోమన్ ఇరానీ లాంటి స్టార్లతో పాటు దర్శక ద్వయం రాజ్ & డీకే లాంటి ప్రముఖులతో కలిసి ఆయన ఒకే వేదికను పంచుకోవడం విశేషం. 

(ఇదీ చదవండి: కెరీర్‌లో మొదటి హిట్.. భాగ్యశ్రీ రెమ్యునరేషన్ డబుల్!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement