'కేజీఎఫ్' తర్వాత యష్ హీరోగా నటిస్తున్న సినిమా 'టాక్సిక్'. వచ్చే నెల 26న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ గ్యాంగస్టర్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీశారు. గీతూ మోహన్ దాస్ దర్శకురాలు కాగా నయనతార, కియారా అడ్వాణీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హ్యుమా ఖురేషీ హీరోయిన్లుగా నటించారు.
(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి మృణాల్ థ్రిల్లర్ సినిమా)
ఈ సినిమా నుంచి తొలుత వచ్చిన టీజర్‌లో శృంగరభరిత కంటెంట్‌ని ఎంతలా చూపించారో తెలిసిందే. తర్వాత వచ్చిన 'తబాహి' అనే పాటలోనూ యష్-కియారా తమదైన శైలిలో రొమాన్స్ పండించారు. ఇప్పుడు తాజాగా 'మనసాగదే' అంటూ ఓ సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో యష్-తారా సుతారియా అలానే రొమాన్స్ పండించారు. బాత్ టబ్‌లో గన్‌తో ప్రపోజ్ చేసిన సీన్ వెరైటీగా అనిపించింది.
'టాక్సిక్' ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే యాక్షన్ కంటే గ్లామరస్ రొమాన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారా అని సందేహం కలుగుతోంది. ఇప్పటివరకు అయితే మూవీపై పెద్దగా అంచనాలు లేవు. రిలీజ్‌కి ఎలానూ మరో నెల రోజులు టైముంది. ఆ లోపు ట్రైలర్ వల్ల ఏమైనా హైప్ పెరుగతుందేమో చూడాలి?
(ఇదీ చదవండి: రోజుకు రూ.100 కోట్లు ఇచ్చినా సోషల్ మీడియాలోకి రాను)


