‘నా క్యారెక్టర్ వచ్చేది అప్పుడే.. కల్ట్‌పై విశ్వక్ సేన్ కామెంట్స్' | tollywood hero Vishwak sen comments about his Cult Movie in song Launch | Sakshi
Sakshi News home page

Vishwak sen: ‘నా క్యారెక్టర్ వచ్చేది అప్పుడే.. కల్ట్‌పై విశ్వక్ సేన్ కామెంట్స్'

Jul 20 2026 4:16 PM | Updated on Jul 20 2026 4:25 PM

tollywood hero Vishwak sen comments about his Cult Movie in song Launch

మాస్ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ కల్ట్. ఈ మూవీకి తానే సొంతంగా కథ రాసుకోవడమే కాదు..డైరెక్షన్‌ కూడా చేస్తున్నారు. ఈ మూవీని కరాటే రాజు, సందీప్‌ కాకర్ల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. హీ ఈజ్ మై దోస్తీ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈవెంట్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ అనేది ఇంటర్వెల్‌లో వస్తుందని తెలిపారు. ఈ మూవీ ద్వారా నేను 150 మందికి పైగా కొత్తవారిని పరిచయం చేస్తున్నానని విశ్వక్ వెల్లడించారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది జూన్‌లోపు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు విశ్వక్ సేన్ తెలిపారు. ఈ నగరానికి ఏమైంది-2 రిలీజైన తర్వాతే కల్ట్ మూవీ వస్తుందన్నారు. కాగా.. ఈ చిత్రాన్ని వాస్తవ ఘటనల ఆధారంగా న్యూ ఏజ్‌ పార్టీ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీని తెలుగు, హిందీ, జపనీస్, స్పానిష్, ఇంగ్లిష్‌ భాషల్లో విడుదల చేయనున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement