ఎట్టకేలకు మారుతికి 'మెగా' హీరో సెట్? | Varun Tej to Act Under Director Maruthi | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు మారుతికి 'మెగా' హీరో సెట్?

Jul 20 2026 11:35 PM | Updated on Jul 20 2026 11:35 PM

Varun Tej to Act Under Director Maruthi

రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘రాజాసాబ్’ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాదించలేక పోయింది. అనంతరం ప్రభాస్ ఎప్పట్లానే తన సినిమాలతో బిజీ అయిపోయాడు. కానీ మారుతి మాత్రం చాలా కాలం పాటు ట్రోలింగ్‌కు గురైయ్యాడు. ఆ సినిమా ప్రమోషన్ సమయంలో ఇచ్చిన సవాళ్లు, స్టేట్‌మెంట్లు ఆయనపై తీవ్ర విమర్శలు, ట్రోలింగ్ తెచ్చాయి. అయితే, ఇటీవల ఆయన కొత్త స్క్రిప్ట్ పనిలో ఉన్నానని, దానికి ఫినిషింగ్ టచ్ ఇస్తున్నానని ప్రకటించారు.

ఇప్పుడు ఆ స్క్రిప్ట్‌కి సరిపోయే హీరోను మారుతి ఫైనల్ చేసినట్టుగా టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఆయన తదుపరి చిత్రంలో మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ నటించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సినిమా తర్వాత, తన చెల్లెలు నిహారిక నిర్మాతగా తెరకెక్కుతున్న ‘బరి’ సినిమాలో నటించాల్సి ఉంది. ఆ సినిమాతో పాటు మారుతి చేయబోయే చిత్రానికి కూడా వరుణ్ తేజ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. వీలైనంత రీజనబుల్ బడ్జెట్‌లో,మంచి కథతో ఈ సినిమా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మారుతికి అత్యంత సన్నిహితుడైన ఓ నిర్మాత ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నాడని సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement