మెడలో తాళితో 'బిగ్‌బాస్' ఫేమ్ ట్రాన్స్‌జెండర్ ప్రియాంక | Bigg Boss Telugu Priyanka Singh With Mangalsutra | Sakshi
Sakshi News home page

Priyanka Singh: 'బిగ్‌బాస్' ప్రియాంక పెళ్లి చేసుకుందా?

Aug 3 2026 1:11 PM | Updated on Aug 3 2026 1:24 PM

Bigg Boss Telugu Priyanka Singh With Mangalsutra

బిగ్‌బాస్ తెలుగు 5వ సీజన్‌తో గుర్తింపు తెచ్చుకున్న ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్.. మెడలో తాళిబొట్టుతో కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేసింది. దీంతో ఈమెప్పుడు పెళ్లి చేసుకుంది? ఎవరిని పెళ్లి చేసుకుందా అని మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: గృహహింస.. సీరియల్ నటికి అత్తారింట్లో వేధింపులు)

శ్రీకాకుళానికి చెందిన సాయితేజ తర్వాత కాలంలో లింగమార్పిడి చేయించుకుని ప్రియాంక సింగ్‌గా మారిపోయారు. కానీ ఈ  విషయాన్ని మాత్రం తల్లిదండ్రులకు చెప్పలేదు. చాలా కాలం పాటు తన తండ్రి వద్ద ఈ విషయాన్ని దాచానని గతంలో ఓసారి ప్రియాంక చెప్పుకొచ్చింది. అయితే బిగ్‌బాస్‌ 5‌లోకి ఎంట్రీ ఇస్తున్న టైంలో తానొక ట్రాన్స్‌జెండర్‌ అనే విషయం తన తండ్రికి తెలిసేలా బయటపెట్టింది.

ఈ షో నుంచి బయటకొచ్చేసిన తర్వాత పలు రియాలిటీ షోల్లో కనిపించిన ప్రియాంక సింగ్.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గానే ఉంటుంది. వ్రతాలు, పూజాలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా మెడలో తాళిబొట్టుతో కనిపించేసరికి సరదాగా ఇది పెట్టిందా? లేదంటే ఎవరైనా పెళ్లి చేసుకుందా అని అనుకుంటున్నారు.

(ఇదీ చదవండి: మిడిల్ క్లాస్ తండ్రిగా రవితేజ.. 'ఇరుముడి' మరో సాంగ్ రిలీజ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement