ఈ వయసులో మళ్లీ పెళ్లి! | Viral Story Of Grandparents Recreating Their Wedding Photos | Sakshi
Sakshi News home page

ఈ వయసులో మళ్లీ పెళ్లి!

Jul 30 2026 10:19 AM | Updated on Jul 30 2026 10:39 AM

Viral Story Of Grandparents Recreating Their Wedding Photos

ఫోటోస్టోరీ

తాతకు మళ్లీ పెళ్లి చేస్తే ఎలా ఉంటుందన్న ఓ మనవడి చిలిపి ఆలోచన ఆరు దశాబ్దాల వివాహ జీవితాన్ని ఒక్కసారిగా నెమరేసుకునేలా చేసింది.

అమెరికాకు చెందిన ఫొటోగ్రాఫర్‌ ఫిలిప్‌ విన్‌హామ్‌ తన తాతయ్య అమ్మమ్మలకు జీవితాంతం గుర్తుండిపోయే సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనుకున్నాడు. డేవిడ్, బెకీ రోచ్‌లకు 1967లో పెళ్లయింది. అప్పటి పెళ్లి ఫొటోలను ఎప్పుడు చూసినా వారిరువురు మురిసిపోతుంటారు.

ఇది గమనించిన విన్‌హామ్‌ ఆ పాతబడ్డ ఫొటోలను తీసుకుని వారిరువురు ఇప్పుడు ఈ వయసులో మళ్లీ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందా... అని ఆలోచించాడు. ఆ ఫొటోలను రీక్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. అలా షేర్‌ చేసిన కొద్దిగంటల్లోనే ఈ ఫొటోలకు వేలకొద్దీ కామెంట్లు వచ్చిపడ్డాయి. వయసు శరీరానికే కాని ప్రేమకు కాదని, ఆరు దశాబ్దాలైనా బంధం ఇంకా దృఢంగానే ఉందంటూ నెటిజెన్లు మెచ్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement