breaking news
grandparents
-
మనపై ‘గాండ్రు’మన్న పులులే మెత్తని గ్రాండ్ పేరెంట్స్ అయ్యారే!
ఈ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారే... వాళ్ల రెండు నాల్కల ధోరణే వేరు. వీళ్లు పేరెంట్స్‌గా ఉన్నప్పుడు తమ పిల్లలు అన్నం తినకపోయినా... సరిగా చదవక΄ోయినా... మాట వినక΄ోయినా విపరీతంగా తిట్టేవారు. కసితీరా కొట్టేవారు. వెరసి... చెడుగుడాడేవాళ్లూ... చెమడాలెక్కతీసేవాళ్లు. ఈ ధోరణితో వాళ్లు ప్రవర్తిస్తున్న కాలంలో పిల్లలుగా మనం బితుకూ బితుకూమంటూ బతికేవాళ్లం. ఎట్టకేలకు వాళ్లిప్పుడు గ్రాండ్స్పేరెంట్స్ అయ్యారు.కాలచక్రం గిర్రున తిరిగి మనకూ ఇప్పుడు పిల్లలు పుట్టారు. కాలేజీలో జూనియర్స్ సీనియర్స్ అయి ‘పేరేంట్య్రాగింగు’ పర్వదినాల కోసం మనమూ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నామా...? అదృష్టవశాత్తూ ఇప్పుడు మన వంతు రాగానే మన పిల్లలు అన్నం తిననప్పుడు మనం బెల్టు పట్టుకోబోయామా... వాళ్లెదురుగా వచ్చి పిల్లలముందు నిలబడిపోతారు. బెత్తం పట్టుకోబోయామా... అడ్డంగా వచ్చేసి కలబడిపోతారు. థూ మన బతుకుచెడా... మన బండపడా... అప్పుడు మనం పిల్లలుగా ఉన్నప్పుడూ బితుకూ బితుకే...ఇప్పుడూ అదే బతుకే! వాళ్లే మన పేరెంటూ... మన నాటి పేరెంట్సే... నేటి గ్రాండ్ పేరెంట్సు. మళ్లీ సదరు గ్రాండు పేరెంట్సు... గ్రాండుగా వాళ్లు చెప్పొచ్చేదేమిటంటే... ‘‘ఏం మాకు పిల్లలు పుట్టలేదా? మేం పెంచలేదా, పెంచడం మాకు తెలియదా’’ అంటూ దబాయింపు. అలా వాళ్లు తమ రెండు నాల్కల ధోరణితో మనల్ని నానామాటలు అంటూ ఉంటే... సదరు మన పేరెంట్సుకూ, మన పిల్లల గ్రాండుపేరెంట్సుకూ ఎదురుచెప్పకూడదంటూ మనలో మనం అనేసుకునే మాటేమిటంటే... ‘‘అయ్యో.... మీకు తెలియక΄ోవడమేమిటీ? అప్పుడు మీరు పెంచిందీ, గసిరిందీ, కొట్టిందీ మమ్మల్నే... ఇప్పుడు పిల్లల ఎదురుగా నిలబడి΄ోతూ, కలబడిపోతూ గసురుతున్నదీ, మాటలు విసురుతున్నదీ మమ్మల్నే!’’ అంటూ గుసగుసగా గునుస్తూ... నేటి మన గ్రాండ్ పేరెంట్స్ గాండ్రుగాండ్రుల పట్ల మురుస్తూ ఇలా బతికేస్తున్నాం... బతికేస్తుంటాం. (చదవండి: -
వృద్ధాప్యంలో డిప్రెషన్: మెరుగు పడేది ప్రేమతో
గత కొంతకాలం కిందట రిటైర్ అయిన పరంధామయ్య మొదట్లో బాగానే ఉండేవారుగానీ ఈ మధ్య అంత చురుగ్గా లేకపోవడంతో పాటు ఎంతో విచారంగా కనిపిస్తున్నారు. పిల్లలిద్దరూ యూఎస్‌లో ఉండటంతో పరంధామయ్య దంపతులిద్దరూ ఒంటరిగానే ఉండాల్సి వస్తోంది. గతంలోలా ఎక్కడికీ వెళ్లడం లేదు. కాస్త మతిమరపు వచ్చినట్టుగా ఫీలవుతున్నారు కూడా. బాగా సన్నిహితులైన ఒకరిద్దరు కనిపించి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లమంటే... ‘తానేమైనా పిచ్చివాడిని అయిపోతున్నానా?’ అనే దిగులు ఆయన్ను మరింత కుంగదీస్తోంది. ఎట్టకేలకు కొందరు ఫ్రెండ్స్ ఆయనను సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే తేలిందేమిటంటే... ఆయన ‘వృద్ధాప్యం తాలూకు డిప్రెషన్’తో బాధపడుతున్నట్లు తేలింది. ఇంట్లో కనీసం మనవలూ, మనవరాళ్లూ ఉండి ఉంటే గ్రాండ్స్ పేరెంట్స్‌కు ఈ పరిస్థితి వచ్చేది కాదేమోనని చెప్పడంతో ఈ వృద్ధాప్యపు డిప్రెషన్ గురించి నలుగురికీ తెలియడం మంచిదని ఫీలయ్యారు పరంధామయ్య ఫ్రెండ్స్. వృద్ధాప్యంలో వచ్చే ఆ ‘ఓల్డ్ ఏజ్ డిప్రెషన్’ తాలూకు వివరాలివి...ఆల్కహాల్‌తోనూ డిప్రెషన్...కొందరు పెద్దవయసు వారు ఆ వయసులో బాగా నిద్రపట్టేందుకూ లేదా హాయిగా సాయంత్రాలు గడిపేందుకూ మద్యం ఒక సాధనమని అనుకుంటుంటారు. అయితే ఆ వయసులో అతిగా తాగే మద్యం వల్ల కూడా డిప్రెషన్ వస్తుంది. ఆల్కహాల్ వల్ల తేలిగ్గా కోపం, చిరాకు వంటి ఉద్వేగాలకు గురికావడం (ఇరిటబిలిటీ), యాంగై్జటీకి లోనుకావడం, మెదడులోని జీవక్రియలు అస్తవ్యస్తం కావడం జరగవచ్చు. ఆల్కహాల్ కారణంగా వృద్ధులకు ఇచ్చే యాంటీ డిప్రెసెంట్ మందులు అంత ప్రభావపూర్వకంగా పనిచేయకపోవడం వంటివీ జరగవచ్చు. మద్యం నిద్ర నాణ్యతను దెబ్బతీసే ముప్పు ఉంటుంది. పైగా మద్యం మత్తులో పడిపోవడం జరిగి, ఆ వయసులో పూర్తిగా మరొకరిపై ఆధారపడాల్సి రావడం కూడా ఒక నిస్సహాయతతో పాటు... అలా ఆధారపడాల్సి రావడమనే భావన కూడా డిప్రెషన్‌కు దారితీయవచ్చు.వయసు పైబడిన వారు ముందుగా గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... తమ మనసుకు వచ్చిన సమస్యనూ లేదా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితిని చాలా సహజమని గుర్తించాలి. తల్లిదండ్రులు కాస్తా గ్రాండ్ పేరెంట్స్‌గా మారే టైముకు పిల్లలు తమ పిల్లలతో (గ్రాండ్ చిల్డ్రెన్తో) కలిసి వాళ్ల కెరియర్ కోసం విదేశాలకు లేదా దూర్రపాంతాలకు వెళ్లడం చాలా సహజం. ఇటీవలి సామాజిక ధోరణి కారణంగా... తమ రిటైర్మెంట్ నాటికి పెద్దలు డిప్రెషన్‌కు లోనుకోవడం చాలా సాధారమవుతోంది. పైగా ఈ తరహా డిప్రెషన్ ఇటీవల చాలామందిలో విపరీతంగా విస్తరిస్తోంది. దురదృష్టవశాత్తు త వైద్యులను సంప్రదించేవారి సంఖ్య చాలా తక్కువగా ఉండటం ఆందోళన గొలిపే అంశం.వృద్ధాప్య డిప్రెషన్‌కు కారణాలు...నిజానికి డిప్రెషన్ ఏ వయసులోనైనా రావచ్చు. కానీ వృద్ధాప్యంలో డిప్రెషన్‌కు లోనయ్యేందుకు అవకాశాలు ఎక్కువ. అందుకు కారణాలివి... → ఒంటరితనం: ముందుగా చెప్పుకున్నట్టు తాము స్థిరపడటానికి పిల్లలు దూర్రపాంతాల్లో ఉంటారు. పెద్దలు తామంతట తాము కదల్లేని స్థితిలో ఉండి, ఇతరుల మీద ఆధారపడాల్సి రావడం డిప్రెషన్‌కు దారితీయవచ్చు. → ఆరోగ్య సమస్యలు: వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలు చాలా సాధారణం. దీర్ఘకాలిక వ్యాధులు, జ్ఞాపకశక్తి, శారీరక దృఢత్వం, వ్యాధి నిరోధకశక్తి తగ్గడం, శస్త్రచికిత్స చేయించాల్సిన జబ్బులకూ వృద్ధాప్యం కారణంగా చికిత్స తీసుకునే పరిస్థితి ఉండకపోవడం వంటి కారణాలతో డిప్రెస్ అవుతుంటారు. → అర్థం లేని భయాలు: ఎవరూ దగ్గరగా లేని సమయంలో తాము చనిపోతామేమో, అలాగైతే తాము చనిపోయిన విషయం పిల్లలకు ఎలా తెలుస్తుంది... లాంటి అర్థం లేని భయాలు వేధిస్తుంటాయి. → ఏ ప్రయోజనాల కోసం బతకాలనే భావన: ఇకపై ఎవరి ప్రయోజనాలకోసం, ఏం సాధించడానికి బతికి ఉండాలనే నిరాశాపూర్వకమైన భావనతో ప్రతికూల ఆలోచనలు వెంటాడటం. → ఇటీవల చూస్తున్న తమ తోటివారి మరణాలు: తమ బంధువుల్లో, తెలిసినవారిలో తమ వయసువారు చనిపోతుండటంతో కలిగే కుంగుబాటు. ఒకవేళ అలా మరణించిన వారిలో తమ జీవిత భాగస్వామి ఉండటం డిప్రెష¯Œ కు దారితీస్తుంది. వైద్య ఆరోగ్య అంశాలతో కలిగే డిప్రెషన్...వృద్ధాప్యంలో వచ్చే కొన్ని రకాల వ్యాధుల వల్ల అంటే ఉదాహరణకు... డయాబెటిస్తో పాటు దాని వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు, హైబీపీ, గుండెజబ్బులు, పక్షవాతం, క్యాన్సర్, థైరాయిడ్ సమస్యలు, విటమిన్ బి–12 లోపం, మతిమరపు, అలై్జమర్స్ వ్యాధి, లూపస్, మల్టిపుల్ స్కి›్లరోసిస్ వంటి కారణంగా డిప్రెషన్‌కు లోనయ్యే అవకాశాలెక్కువ.కొన్ని రకాల మందులతోనూ డిప్రెషన్... కొన్ని సందర్భాల్లో ఆ వయసులో వాడే కొన్ని రకాల మందుల వల్ల కూడా డిప్రెషన్ రావచ్చు. ఉదాహరణకు మామూలుగా రక్తపోటుకు వాడే కొన్ని మందులు, బీటా బ్లాకర్లు, కొన్ని రకాల నిద్రమాత్రలు, క్యాల్షియమ్ ఛానెల్ బ్లాకర్లు, పార్కిన్సన్ డిసీజ్ తాలూకు మందులు, అల్సర్ మందులు, గుండెజబ్బుల మందులు, కొన్నిరకాల స్టెరాయిడ్స్, హైకొలెస్ట్రాల్ ఉన్నవారు వాడే మందులు, నొప్పినివారణ మందులు, ఆర్థరైటిస్ ఔషధాలు, ఈస్ట్రోజెన్ హార్మోన్ వంటివి పెద్దవయసు వారిలో డిప్రెషన్‌కు కారణం కావచ్చు.డిప్రెషన్ నుంచి దూరమవ్వాలంటే... తమ పట్ల తాము కాస్తంత శ్రద్ధ తీసుకోవడం ద్వారా ఎంతగా వయసు పైబడినప్పటికీ డిప్రెషన్‌ను దరిచేరనివ్వకుండా చూడవచ్చు. వృద్ధాప్యంలో డిప్రెషన్‌ను నివారించే చర్యలివే... → నలుగురినీ కలవడం : వృద్ధాప్యంలో కలిగే తీరికతో నలుగురినీ కలుస్తుండటం.(డిప్రెషన్ నివారణకూ లేదా అధిగమించడానికి ఇది బాగా పనిచేస్తుంది). → వ్యాయామం : తమకు శారీరక శ్రమ కలిగించని రీతిలో వాకింగ్ వంటి వ్యాయామల వల్ల డిప్రెషన్ దరిచేరదు. → కంటి నిండా నిద్ర: కంటినిండా నిద్రపోవడం డిప్రెషన్‌కు మంచి మందు. అయితే మితిమీర కూడదు. అంటే... నిద్రసమయం 7–9 గంటలు మించనివ్వవద్దు. → సమతుల ఆహారం : అన్ని పోషకాలు అందేలా తేలిగ్గా జీర్ణమయ్యే సమతులా ఆహారం తీసుకోవాలి. జంక్‌ఫుడ్ వద్దు. → హాబీలు : మనకు ఆసక్తి కలిగించే హాబీలను కొనసాగించవచ్చు. యుక్తవయసులో పనిఒత్తిడి, తీరిక లేని కారణంగా మానేసిన హాబీలను ఈ సమయంలో పునరుద్ధరించుకోవడం డిప్రెషన్ నివారణకు చాలా మేలు చేస్తుంది. → పెంపుడు జంతువులు : పెట్స్ ఆలనా–పాలనా డిప్రెషన్‌ను దరిచేరనివ్వవు.→ కొత్త విద్యలు/ నైపుణ్యాలు : వీటిని నేర్చుకోవడం డిప్రెషన్‌ను అధిగమించడానికి చాలా మేలు చేస్తుంది. ఆసక్తి ఉంటే ఏ వయసులోనైనా, ఏ విషయాన్నైనా నేర్చుకోవచ్చు. పైగా వృద్ధాప్యంలో వేరే వ్యాపకాలేవీ ఉండవు కాబట్టి ఆ టైమ్‌లో నేర్చుకోవడం సులభం కూడా.→ హాస్యం : ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ, హాస్యప్రియత్వం కలిగి ఉండటం. వృద్ధాప్య డిప్రెషన్ లక్షణాలు → ఎప్పుడూ తీవ్రమైన నిరాశ, విచారం ∙నిత్యం అలసట ∙గతంతో తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిన హాబీలూ లేదా వ్యాపకాలపైనా ఆసక్తి కోల్పోవడం ∙ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం ∙్రఆకలి తగ్గడం ∙బరువు తగ్గం ∙తరచూ నిద్రాభంగం లేదా ఒక్కోసారి మితిమీరి నిద్రపోతుండటం ∙తనతో ఏ ప్రయోజనమూ లేదనీ, తాను సమాజానికి భారమనే భావన ∙మద్యం/డ్రగ్స్‌కు బానిస కావడం ∙త్వరగా మరణించాలనే భావన లేదా ఆత్మహత్యా ధోరణి/ ఆలోచనలూ/ యత్నాలు.చికిత్సపై నివారణ చర్యల తర్వాత కూడా డిప్రెషన్‌కు లోనైన వారికి సైకియాట్రిస్ట్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ఆర్ మందులు, యాంటీడిప్రెసెంట్స్తో చికిత్స చేయాల్సి ఉంటుంది. కొందరిలో కేవలం కౌన్సెలింగ్‌తోనే సమస్య తీరవచ్చు. కొందరికి కౌన్సెలింగ్‌తో పాటు మందులూ అవసరం పడవచ్చు.అది బాధా... డిప్రెషనా?కొందరిలో డిప్రెషన్ కాకుండా తీవ్రమైన బాధ కూడా ఉండవచ్చు. కాస్త శ్రద్ధగా పరిశీలించుకుంటే అది డిప్రెషనా లేక బాధనా అన్నది గుర్తుపట్టడమూ కాస్తంత తేలికే. ఉదాహరణకు బాధలో ఉన్నవారికి అప్పుడప్పుడైనా సంతోష భావన కలుగుతుంది. అలాంటి సంతోష భావనలూ, ఆనందాలూ, ఇతరత్రా ఉద్వేగాలేవీ లేకుండా ఎప్పుడూ విచారం, బాధ, నిరాశ, నిస్పృహలతో ఉంటే అది డిప్రెషన్‌గా పరిగణించవచ్చు.వృద్ధుల్లో డిప్రెషన్‌ను గుర్తించడమిలా...→ తమలో అంతకు మునుపు లేని నొప్పులను ఏకరవు పెడుతుండటం ∙తాము ఏపనీ చేయలేకపోతున్న విషయాలను తరచూ ప్రస్తావిస్తూ ఉండటం ∙యాంగై్జటీకి గురికావడం / వేదన, బాధలను వ్యక్తపరుస్తుంటం ∙త్వరగా భావోద్వేగాలకు గురికావడం ∙వ్యక్తిగత విషయాలపై తగిన శ్రద్ధ చూపకపోవడం.విచారం/బాధలూ లేకున్నా డిప్రెషన్! సాధారణంగా డిప్రెషన్లో తీవ్రమైన విచారం, బాధ ఉండటం చాలా సాధారణం. కొందరిలో ఇలాంటి లక్షణాలేమీ కనిపించకుండానే డిప్రెషన్లోకి వెళ్లే అవకాశాలుంటాయి. ఏ పనిపైనా వాళ్లకు ఆసక్తిలేకపోవడం; ఏదైనా చేయాలంటే ఉత్సాహం లేకపోవడం (లో మోటివేషన్); ఏదైనా పని చేయడానికి తగిన శక్తి/సామర్థ్యం తమలో లేదనే భావన వంటి ఫీలింగ్స్‌తో ఈ డిప్రెషన్ కనిపిస్తుంది. కొందరిలో ఎప్పటికీ తగ్గని ఒంటి నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలతో కూడా వృద్ధాప్యపు డిప్రెషన్ వ్యక్తం కావచ్చు.డాక్టర్ శ్రీనివాస్ ఎస్‌ఆర్‌ఆర్‌వై హెచ్‌వోడీ ఆఫ్ సైకియాట్రీ –సీనియర్ సైకియాట్రిస్ట్ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రి, వరంగల్– యాసీన్ -
ఓల్డ్ is గోల్డ్: కొత్త తరానికి వారధులు
వయసైపోయి, శక్తి ఉడిగిందని గ్రాండ్ పేరెంట్స్‌ని చులకనగా చూడకండి. ఈ యుగపు వేగంతో నత్త వారసులేం పోటీపడగలరు అనుకోకండి. వాట్సాప్‌లు, స్నాప్‌చాట్‌లు, ట్విటర్లు, ఇన్‌స్టా హ్యాండిల్స్‌లో వాళ్లు యమ యాక్టివ్. ఫేస్‌టైమ్.. స్కైపుల్లో భలే షార్ప్. షాట్స్, రీల్స్‌లో సూపర్ ఫాస్ట్. జెన్ జీ జార్గాన్నూ జీర్ణించుకుంటున్నారు. ఆధ్యాత్మికతనూ ఆస్వాదిస్తున్నారు. సాఫ్ట్వేర్ అప్డేట్స్ పట్లా అవగాహనతో ఉంటున్నారు. టూర్స్ అండ్ ట్రావెల్స్కీ రెడీ అవుతున్నారు. ఇంటి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ దాకా కావల్సినంత ఇన్ఫో ఇస్తున్నారు. అన్నింటిలోనూ గ్రాండ్‌నెస్‌ను చవిచూపిస్తున్న వాళ్లే గ్రాండ్ పేరెంట్స్. వారితో కనెక్టివిటీని పెంచే ఉద్దేశంతోనే ‘గ్రాండ్‌పేరెంట్స్ డే’ సెలబ్రేషన్ మొదలైంది.ఆకాశంలోని చుక్కల్ని పరిచయం చేయడం దగ్గర్నుంచి కథలతో ఊహలను ఉసిగొల్పడం వరకు మన జీవితాల్లో అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు పోషించిన పాత్రను వర్ణించగలమా? అందుకు వాళ్లు నేర్పిన మాటలతోపాటు మనం నేర్చుకున్న భాషల్లోని వొకాబులరీని అరువు తెచ్చుకున్నా సరిపోదు. రామాయణంలో రాముడి వ్యక్తిత్వాన్ని, భాగవతంలోని కృష్ణుడి లీలలను, భారతంలోని యుద్ధనీతిని.. పురాణ స్త్రీల ఔన్నత్యాన్ని, చరిత్రలోని పరాక్రమాన్ని.. వెండితెర అద్భుతాలను తమదైన బాణి, వాణితో బుజ్జి మెదళ్లలో నింపే గుర్తులు మరుపుకొచ్చేవా! ఆ కాలానికీ ఈ కాలానికీ వారధులైన గ్రాండ్‌పేరెంట్స్ మనల్ని నడిపించే గురువులు. బడులు బోధించలేని ఎన్నో పాఠాలను వాళ్ల అనుభవ జ్ఞానం బోధిస్తుంది. అందుకే.. ముసలాళ్లని వాళ్లను మూలకు తోసేయొద్దు. మనకన్నా ముందు ప్రపంచాన్ని చూసినవాళ్లని.. ఔపోసనపట్టిన పెద్దవాళ్లని గౌరవిద్దాం. రోజూ కుదరకపోయినా.. వారాంతాల్లోనైనా వాళ్లతో కాస్త సమయాన్ని వెచ్చిద్దాం. కనీసం గ్రాండ్‌పేరెంట్స్ డే అయినా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేద్దాం! హ్యాపీ గ్రాండ్‌పేరెంట్స్ డే!మెరియన్ మెక్వేడ్ అనే గృహిణి.. పెద్దలను గౌరవించాలని, వారి అనుభవజ్ఞానానికి విలువివ్వాలని.. దాన్నో సంస్కృతిగా మార్చాలనే తలంపుతో గ్రాండ్‌పేరెంట్స్ డే అనే కాన్సెప్ట్‌ని క్రియేట్ చేసి.. దాన్నో వేడుకగా మలచింది. అప్పటి నుంచి ప్రపంచంలోని పలు దేశాలు వాళ్లకు అనువైన నెలల్లో ఈ గ్రాండ్ పేరెంట్స్ డేను నిర్వహించుకుంటున్నాయి. అలా మనం ప్రతి ఏడు సెప్టెంబర్లోని మొదటి ఆదివారం నాడు గ్రాండ్‌పేరెంట్స్ డేని జరుపుకుంటున్నాం!ఈరోజు నేనీ స్థాయిలో ఉండటానికి కారణం మా తాతయ్యే (పీవీ గోపాలన్). చదువు దగ్గర్నుంచి మహిళా హక్కులు, ప్రజా సేవ వరకు నా మీద ఆయన ప్రభావం చాలా ఉంటుంది. ఆయన చాలా ప్రొగ్రెసివ్. అమ్మాయిల చదువుకు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఎన్నో విషయాలను తాతయ్య దగ్గరే నేర్చుకున్నాను. – కమలా హ్యారిస్మా నాన్న, చిన్నాన్న యాక్టర్స్ అయినా నాతోపాటు అక్క (కరిష్మా కపూర్), తమ్ముడు (రిషీ కపూర్) అందరం ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇన్స్పైర్ అయింది మాత్రం మా తాతగారు రాజ్‌కపూర్ వల్లనే! ఫ్యామిలీ యూనిటీ నుంచి సినిమాల దాకా చాలా విషయాల్లో ఆయన చెప్పిన మాటలు, చూపిన దారినే అనుసరిస్తాం! – కరీనా కపూర్క్రమశిక్షణ, బాధ్యత వంటి విషయాలను మా తాతయ్య (లెఫ్టినెంట్ కల్నల్ రామేశ్వర్‌నాథ్ డియోల్) నుంచే నేర్చుకున్నాను. ఏ పని చేసినా నిబద్ధత ముఖ్యమనే ఆయన మాటలనే జీవన విలువగా పాటిస్తున్నాను. – అభయ్ డియోల్ -
గ్రాండ్ పేరెంట్స్‌కి ఉచితం
సత్యరాజ్, వశిష్ఠ ఎన్. సింహా, ‘సత్యం’ రాజేశ్, ఉదయభాను, సాంచి రాయ్ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. మారుతీ టీమ్ ప్రొడక్ట్ సమర్పణలో విజయ పాల్ రెడ్డి అడిదల నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ‘‘మా సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఎక్కువగా మహిళా ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. అందుకే ఓ ఆఫర్ ఇస్తున్నాం. సెప్టెంబర్ మొదటి వారంలో గ్రాండ్ పేరెంట్స్ డే (సెప్టెంబర్ 7). ఈ నేపథ్యంలో ఆగస్ట్ 30, ఆగస్ట్ 31న ప్రదర్శించే సాయంత్రం ఆటకు కుటుంబంతో కలిసి వచ్చే గ్రాండ్ పేరెంట్స్‌కి ఉచితంగా ప్రవేశం కల్పించనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
75 ఏళ్లుగా చెక్కుచెదరని పెంకుటిల్లు..!
ధాన్యాగారంగా మిద్దెలు.. చంటిబిడ్డ ఊయలకు దూలాల సహకారం.. ఉమ్మడి కుటుంబాలకు చిరునామాలు ఈ పెంకుటిల్లు. 75 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఠివీగా నిలబడ్డాయి. అందానికి అందం.. ఆహ్లాదం పంచుతున్న ఈ ఇళ్లు నవతరాన్ని పాతకాలం నాటి రోజుల్లోకి తీసుకెళ్తున్నాయి. తాతలు కట్టించిన ఈ పెంకుటిళ్లపై మమకారంతో వారసులు ఆధునిక సొబగులు అద్దుతున్నారు. బోధన్: పల్లెల్లో అనాదిగా వ్యవసాయమే ముఖ్య జీ వనాధారమైన ధనిక, మధ్యతరగతి రైతు కుటుంబాలు తమ అవసరాలకనుగుణంగా మట్టి గోడల తో పెంకుటిళ్లను విశాలంగా నిర్మించారు. పాడి పశువులు, ధన ధాన్యాలు పదిలపర్చుకునేలా అపురూప ఆకృతులతో మట్టి, టేకు కర్రలు ఉపయోగించి కట్టుకున్న ఇళ్లు ఏళ్లు గడిచినా చెక్కుచెదరకుండా దర్శనమిస్తున్నాయి. తాతలు కట్టించిన పెంకుటిళ్లపై మమకారంతో వారసత్వ సంపదగా గుర్తించి వాటికి రూ. లక్షలు వెచ్చించి మరమ్మతులు చేపట్టి ఆధునికతను జోడిస్తున్నారు. ఈ పెంకుటిల్లు వయస్సు 75 ఏళ్లు సాలూర మండల కేంద్రంలోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన దివంగత ములిగే వీరన్న కట్టించిన ఇళ్లు ఇది. 75 ఏళ్ల క్రితం పాండ్రి మట్టి (తెల్లమట్టి),పై కప్పు, టేకు కర్రలు, కుమ్మరి పెంకు, దూలాలు, వాసాలు ఉపయోగించి పటిష్టంగా నిర్మించారు. 3 ఫీట్ల వెడల్పాటి మట్టి గోడలు, 15 ఫీట్ల ఎత్తుతో రెండస్తుల ఇల్లు నిర్మించి దశాబ్దాలపాటు అందులోనే నివసించారు. ములిగే æ వీరన్న మనుమడు ములిగే జయరాం రెండేళ్ల క్రితం పైమొదటి అంతస్తును తొలగించి మరమ్మతులు చేయించారు. పైకప్పు కుమ్మరి పెంకుకు బదులు బెంగుళూర్ పెంకుని అమర్చారు. మట్టి గోడలకు సిమెంట్‌తో ప్లాస్టరింగ్ చేయించి, రంగులద్ది అందంగా తీర్చిదిద్దాడు. ఇంటిలోపల, ముందు భాగంలో ఆహ్లాదకర వాతావరణం కోసం పూలు, పండ్ల మొక్కలు పెంచారు. నాటి మట్టిగోడల పెంకుటిల్లు ప్రస్తుతం అందమైన పొదరిల్లులా దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది. తాత కట్టించిన ఇంటిపై మమకారంతో సౌకర్యవంతంగా మార్చుకొని కుటుంబసభ్యులతో కలిసి జయరాం నివసిస్తున్నాడు. మట్టి గోడలు వేడిని గ్రహించి, ఇళ్లు వేడిగా మారకుండా నిరోధిస్తాయని, దీంతో ఇళ్లంతా చల్లదనంతో ఉంటుందని జయరాం అంటున్నారు. శీతాకాలంలో వెచ్చదనం, వేసవి కాలంలో ఎండలు దంచి కొడుతున్నా చల్లదనాన్ని పంచుతోందని చెబుతున్నారు. ఈ ఇళ్లంటే ఎంతో ఇష్టం మా తాత కట్టిన ఇళ్లంటే మాకెంతో ఇష్టం. ఆ రోజుల్లోనే డూప్లెక్స్ ను మరిపించేలా క ట్టించారు. మా పిల్లల కు సైతం ఈ ఇళ్లంటే ఎంతో మక్కువ. అప్పుడప్పుడు మరమ్మతులు చేయిస్తూ ఇక్కడే నివసిస్తున్నాం. – బండారు హన్మాండ్లు సేట్ ఎండకాలం చల్లగా... చలికాలం వెచ్చగా.. రుద్రూర్: ప్రస్తుత ఎండలతో ఏసీ లేదా కూలర్ లేనిదే ఇంట్లో ఉండలేని పరిస్థితి ఉంది. కానీ పాతకాలంలో మట్టితో కట్టిన ఇళ్లు చల్లదనాన్ని పంచుతున్నాయి. పొతంగల్ మండల కేంద్రంలో 75 ఏళ్ల క్రితం బండారు అరుణ్ సేట్ తండ్రి విఠల్ సేట్ నిర్మించిన ఇళ్లు పాత కాలంనాటి వైభవానికి అద్దం పడుతోంది. అప్పట్లో మట్టి, డంగు సున్నం, టేకు కర్రలతో ఈ ఇళ్లు నిర్మించారు. మధ్యలో ఖాళీగా ఉంచి నాలుగు వైపులా రెండతస్తులతో డూప్లెక్స్‌ను మైమరించేలా తీర్చిదిద్దారు. -
నిజమైన ప్రేమ అంటూ ఫొటోలు షేర్ చేసిన చహల్ భార్య.. ఫొటోలు వైరల్
-
రెండు రోజుల్లో అవ్వాతాతల చేతికి రూ.1,654.61 కోట్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వివిధ చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పింఛన్ డబ్బులు పంపిణీ రెండో రోజు శనివారం కూడా ముమ్మరంగా కొనసాగింది. వలంటీర్లు శనివారం సాయంత్రం వరకు 60,03,709 మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి రూ.1,654.61 కోట్లు పింఛన్ డబ్బులు పంపిణీ చేశారు. డిసెంబరు నెలలో మొత్తం 65,33,781 మందికి పింఛన్ల పంపిణీ కోసం రూ.1,800.96 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం లబ్ధిదారుల్లో 91.89 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తిచేశారు. ఈ నెల 5వ తేదీ వరకు మిగిలిన లబ్ధిదారుల ఇళ్లకు వలంటీర్లు వెళ్లి పింఛన్లు అందజేస్తారని అధికారులు తెలిపారు. -
సెలవైనా ఠంఛన్‌గా పింఛన్
సాక్షి, అమరావతి: సెలవు రోజైనా ప్రభుత్వం ఠంఛన్‌గా అవ్వాతాతలకు పింఛన్లు పంపిణీ చేసింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి రాష్ట్రవ్యాప్తంగా 51,37,566 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళ, వివిధ రకాల చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.1,415.64 కోట్ల మొత్తాన్ని అందజేశారు. అక్టోబరు ఒకటో తేదీ నుంచి పంపిణీకిగాను 65,78,854 మంది లబ్ధిదారుల కోసం ప్రభుత్వం మొత్తం రూ.1,813.60 కోట్ల విడుదల చేసింది. ఒకటో తేదీ ఆదివారం సెలవు అయినా.. సాయంత్రానికి 78.09 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తయినట్టు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. మిగిలిన వారి కోసం ఐదోతేదీ వరకు వలంటీర్ల ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని తెలిపారు. -
పింఛన్లు:65,98,138
సాక్షి, అమరావతి: అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వివిధ రకాల చేతి వృత్తిదారులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా మరో 1,93,680 మందికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మంగళవారం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలో ప్రతి నెలా అందజేసే పింఛన్ల సంఖ్య రికార్డు స్థాయిలో 65,98,138కి చేరింది. కొత్తగా మంజూరైన వారికి ఈ నెల నుంచే ఫింఛన్ డబ్బులు పంపిణీ చేసేందుకు వీలుగా ఈ నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని 14వతేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో ఏఎండీ ఇంతియాజ్ తెలిపారు. కొత్త పింఛన్ల మంజూరుకు అదనంగా అవసరమయ్యే నిధులను కూడా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని, చాలా చోట్ల మంగళవారం సాయంత్రం నుంచే కొత్త పింఛన్‌దారులకు నగదు పంపిణీ ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెలలో కొత్తగా పింఛన్ మంజూరైన 1,93,680 మంది లబ్ధిదారులలో 95,653 మంది అవ్వాతాతల వృద్ధాప్య పింఛన్లున్నాయి. 40,058 మంది వితంతువులు, 29,858 మంది దివ్యాంగులు, 6,861 మంది డప్పు కళాకారులు, 4,763 మంది మత్య్సకారులు, 2,844 మంది కల్లుగీత కార్మికులు, 4 వేల మంది హెచ్ఐవీ బాధితులు కాగా మిగిలినవి ఇతర పింఛన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెలలో కొత్తగా 3,42,452 మందికి పింఛన్లు... ఎప్పటిమాదిరిగానే ఈ నెల ఒకటో తేదీనే ప్రభుత్వం పింఛన్ల పంపిణీ ప్రారంభించే సమయంలో 1,48,772 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. అప్పటికే పింఛన్ల పొందుతున్న వారితో కలిపి సెప్టెంబరు ఒకటో తేదీన ప్రభుత్వం మొత్తం 64,04,458 మంది లబ్ధిదారులకు పింఛన్ల మొత్తాన్ని విడుదల చేసింది. తాజాగా రెండో విడతగా మంగళవారం మంజూరు చేసిన 1,93,680 మంది కొత్త లబ్ధిదారులతో కలిపి ఈ నెలలో రెండు విడతల్లో మొత్తం 3,42,452 మందికి ప్రభుత్వం కొత్త పింఛన్లను మంజూరు చేయడం గమనార్హం. ఒక్క నెలలో పింఛన్లకు రూ.1,819.02 కోట్లు.. సెప్టెంబరు ఒకటో తేదీన మొత్తం 64,04,458 మందికి పింఛను డబ్బుల పంపిణీకి రూ.1,764.83 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా కొత్తగా మంజూరు చేసిన వారితో కలిపి ఈ నెలలో మొత్తం 65,98,138 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం మొత్తం రూ.1,819.02 కోట్లను సెప్టెంబర్‌లో విడుదల చేసింది. ఈ నెలలో రెండు విడతలతో పాటు కొత్తగా పింఛన్లు మంజూరు చేసిన 3,42,452 మంది లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.96.12 కోట్ల చొప్పున అదనంగా ఖర్చు చేసేందుకు ముందుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. నాలుగేళ్లలో 28.26 లక్షల కొత్త పింఛన్లు రాష్ట్రంలో ప్రస్తుతం పింఛన్లు పొందుతున్న ప్రతి పది మందిలో నలుగురుకి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తరువాతే కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయని అధికారులు తెలిపారు. జగన్ సీఎం అయ్యాక 28,26,884 మందికి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసినట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు గణాంకాలతో వెల్లడిస్తున్నారు. గత ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్ల కోసం సరాసరిన రూ.400 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా ఇప్పుడు సీఎం జగన్ ప్రభుత్వం సెప్టెంబరు నెలలో ఏకంగా రూ.1,819 కోట్లు వెచ్చించడం గమనార్హం. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత గత నాలుగేళ్లుగా లంచాలు, వివక్షకు తావు లేకుండా అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. అవ్వాతాతలతో పాటు దివ్యాంగులకు ఏ చిన్న కష్టం లేకుండా ప్రతి నెలా ఒకటో తేదీనే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ల సొమ్మును అందజేస్తున్నారు. -
పిల్లలను తాత ముత్తాతలతో విడదీయలేం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ‘తాత ముత్తాతలు, అమ్మమ్మ నానమ్మలు.. తమ మనవళ్లు, మనవరాళ్లను కలవకుండా ఉండలేరు. పిల్లలంటే తల్లిదండ్రులకే కాదు.. నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలకు కూడా ప్రేమ, అభిమానం, వాత్సల్యం ఉంటుంది. పిల్లల ఎదుగుదలలో తాతముత్తాతల పాత్ర కూడా ముఖ్యమైనదే. పిల్లల సంరక్షణ అంటే ఒక్క డబ్బుతో ముడిపడిందే కాదు.. పలు దృక్కోణాల్లో చూడాలి. తండ్రి/తల్లి బిడ్డను జాగ్రత్తగా చూసుకోగలిగినంత మాత్రాన అది పూర్తిగా పరిగణించబడదు. జీవితంలో దగ్గరి వ్యక్తుల, తమకు ఇష్టమైన వారి జీవన విధానాన్ని అనుసరిస్తూ చిన్నారులు వ్యక్తిగా ఎదుగుతారు. ప్రతి బిడ్డ సంతోషకరమైన బాల్యానికి అర్హులు. తాత–తల్లిదండ్రుల ఉనికి నుంచి మనుమలు పొందే ప్రేమ, ఆప్యాయత, భద్రత నిస్సందేహంగా ముఖ్యమైనవి. వీటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి’అని ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మొదటి భార్య(ఓ చిన్నారి తల్లి) మరణించడంతో నల్లగొండకు చెందిన ఓ వ్యక్తి రెండో వివాహం చేసుకున్నాడు. ఆ చిన్నారి ప్రస్తుతం తండ్రి వద్దే ఉంటోంది. చిన్నారిని తన సంరక్షణకు ఇవ్వాలంటూ నల్లగొండకు చెందిన 56 ఏళ్ల మహిళ(చిన్నారి అమ్మమ్మ) జిల్లా కోర్టులో పిటిషన్ వేసింది. కేసు విచారణ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, మనవరాలిని చూసేందుకు తనకు అనుమతి ఇవ్వడం లేదని, ఇచ్చేలా ఆమె తండ్రిని ఆదేశించాలని కోరుతూ ఆ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. ఈ సివిల్ రివిజన్ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున కె.సీతారాం, ప్రతివాది తరఫున పి.విజయ్‌కుమార్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి అనుబంధాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఈ కేసులో అత్త, అల్లుడి వివాదాలను కోర్టు పరిగణనలోకి తీసుకోవడంలేదు.వారి వివాదాలు పిల్లల మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపకూడదు. అమ్మమ్మ తాతయ్యల పట్ల ద్వేషంతో పెంచితే పాప కచ్చితంగా మంచి మనిషిగా పరిణామం చెందదు. ఇది జీవితకాల ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది అనడంలో సందేహం లేదు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత అమ్మమ్మ తన మనవరాలిని వారానికి ఒకసారి కలవడానికి అనుమతి ఇస్తున్నాం’అని ఆదేశించింది. చదవండి: Mukarram Jha: నిజాం రాజు ముకరం జాకు సీఎం కేసీఆర్ నివాళులు.. -
తోడొకరుండిన అదే భాగ్యమూ.. ఆరోగ్యమూ..
ప్రభుత్వోద్యోగిగా రిటైరైన ఎఎస్‌రావు నగర్ వాసి ప్రహ్లాదరావు, కొన్నాళ్ల క్రితం భార్యను కోల్పోయారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం దెబ్బతిని డయాబెటిస్, బీపీ వగైరాలు చుట్టుముట్టాయి. ఇటీవల ఆయన తన వయసుకు తగ్గ తోడును వెదుక్కుని మళ్లీ ఓ జంటవారయ్యారు. కొన్ని నెలల్లోనే ఆయన ఆరోగ్య సమస్యలూ నియంత్రణలోకి వచ్చాయి. పిల్లలంతా వేర్వేరు చోట్ల స్థిరపడిపోవడంతో ఒంటరిగా ఉంటున్న శైలజ (55) ఇటీవలే తనలాగే ఒంటరిగా ఉంటున్న స్నేహితుడితో కలిసి జీవించడం ప్రారంభించారు. విచిత్రంగా ఆమెను వేధించిన డిప్రెషన్, నిద్రలేమి తదితర సమస్యలన్నీ మాయమయ్యాయి. ‘ఏ వయసులోనైనా తోడు అనేది ఒక తప్పనిసరి. అది మనిషిని మానసికంగా సేదతీర్చి అనేక ఆరోగ్య సమస్యలకు చికిత్సలా పనిచేస్తుంది’ అని నగరానికి చెందిన ఫిజిషియన్ డా.శంకర్ చెప్పారు. సాక్షి, హైదరాబాద్ : ఒంటరి జీవితం ఏ వయసులోనైనా దుర్భరమే అయినప్పటికీ.. మరే రకమైన వ్యాపకం లేని వృద్ధులకు అది మరింత తీవ్రమైన సమస్యగా మారుతుంది. ఈ పరిస్థితిలోనే అనేక రకాల శారీరక, మానసిక అనారోగ్యాలకు వారు గురవుతారు. అప్పటిదాకా లేని జబ్బులు వారిని చుట్టుముడతాయి. ‘‘మానసిక వేదన, నిరాశా నిస్పృహలు, తాము అప్ర«దాన వ్యక్తులుగా మారామనే భావన...రోగ నిరోధకశక్తిని తీవ్రంగా దెబ్బతీస్తాయి. దాగి ఉన్న వ్యాధులు విజృంభించేలా చేస్తాయి’’ అని సైకాలజిస్ట్ ప్రవీణ్ చెప్పారు నిద్రలేమి, బీపీ తగ్గాయి.. ఒంటరిగా ఉన్నప్పుడు రక్తపోటు, చక్కెర వ్యాధి, నిద్రలేమి వంటి సమస్యలు వేధించేవి. నిత్యం మందులు వాడాల్సి వచ్చేది. ఈ పరిస్థితిలో టైమ్‌కి మందులవీ ఇచ్చి నా బాగోగులు చూసుకునేందుకు ఒకరు ఉంటే బాగుండని రాజేశ్వరిని పెళ్లి చేసుకుంటే... తనే నా పాలిట మెడిసిన్‌గా మారింది. ఇప్పుడు నిద్రలేమి పోయింది.. మందుల అవసరం తగ్గిపోయింది. –కోటేశ్వరరావు ఆ‘పరేషాన్’ తీరింది... వ్యక్తిగతంగా నేనూ 60ఏళ్ల వయసులో పునర్వివాహం చేసుకున్నాను. ఆ పెళ్లి నాతో పాటు నా భర్త ఆరోగ్యాన్ని కూడా చాలా మెరుగయ్యేలా చేసింది. తోడు నీడ స్థాపించడానికి అదో కారణం. మా సంస్థ ద్వారా కొన్ని వందల మంది సీనియర్ సిటిజన్స్‌ని పెళ్లిళ్లు/లివిన్ రిలేషన్ షిప్స్ ల ద్వారా జంటలుగా మార్చాం. అది అనేకమందికి అప్పటికే ఉన్న అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపింది. ఒంటరిగా ఉన్న ఓ పెద్దావిడ ఎప్పటి నుంచో వాయిదా వేస్తూ వచ్చిన మోకాలి చిప్ప ఆపరేషన్ ను పెళ్లయిన వెంటనే చేయించుకోగలిగారనేది దానికో చిన్న ఉదాహరణ మాత్రమే. –రాజేశ్వరి, నిర్వాహకులు తోడు నీడ సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం (చదవండి: ‘లింక్’ ప్యాకేజ్... అనుసంధాన రోడ్లకు రూ.2410 కోట్లు) -
చీరకట్టులో మెరిసిపోతున్న సాయి పల్లవి.. నిజంగా ఫిదానే!
ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను దగ్గరైంది తమిళ భామ సాయి పల్లవి నేచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. తన అందం, అభినయంతో కుర్రకారును ఆకట్టుకుంటూ తెలుగు, తమిళ భాషల్లో బిజీ హీరోయిన్గా మారిపోయింది. సినిమాలతో పాటు సమయం చిక్కినప్పుడల్లా కుటుంబంతో గడిపేందుకు రెడీగా ఉంటుంది. తాజాగా సాయి పల్లవి తన తాతయ్య 85వ పుట్టినరోజు వేడుకల్లో సంప్రదాయ చీరకట్టులో కనిపించి నిజంగానే అందరినీ ఫిదా చేసింది. నీలిరంగు పట్టు చీరలో అందంగా, ముద్దుగా మెరిసిపోతుంది. ముఖంపై ఏ మాత్రం మేకప్ లేకున్నా కుందనపు బొమ్మలా కనిపిస్తోంది. తాతయ్య, అమ్మమ్మ, చెల్లెలితో కలిసి ఫోజులిస్తూ దిగిన ఫోటోలో ముఖం నిండా చిరునవ్వు.. అమితమైన సంతోషం కనిపిస్తోంది. ‘మూలాలు(రూట్స్).. తాత 85వ పుట్టినరోజు’ అంటూ వేడుకకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట్లో వైరల్‌గా మారాయి. దీనిపై సెలబ్రిటీలు, అభిమానులు స్పందిస్తున్నారు. నటి రాశీఖన్నా ‘బ్యూటీ’ అంటూ కామెంట్ చేసింది. ‘ప్లాస్టిక్ బ్యూటీ ఇండస్ట్రీలో సాయి పల్లవి నేచురల్ బ్యూటీ. నేచురల్ బ్యూటీ క్వీన్. బ్యూటీఫుల్’ అంటూ ఓ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక సాయి పల్లవి ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లవ్ స్టోరీలో చేస్తుంది. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ఈ ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే విధంగా రానా ప్రధాన పాత్రలో రూపొందుతున్న విరాట పర్వం సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా ఈ హీరోయిన్గా చేస్తుంది. View this post on Instagram A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) -
గ్రాండ్ పేరెంట్స్ ఘనత ఎంతో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ : ఆధునిక సమాజంలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ పేరెంట్స్ (తాతలు, అమ్మమ్మలు లేదా బాపమ్మలు) నిర్వహిస్తున్న పాత్ర అంతా ఇంతా కాదు. పిల్లల సంరక్షణ నుంచి వారి పెళ్లిళ్ల వరకు వారు నిర్వహిస్తున్న పాత్ర అమోఘమైనది. పిల్లల సంరక్షణతోపాటు వారికి సామాజిక మార్గనిర్దేశంలో వారి పాత్ర మరువ లేనిది. కుటుంబ పోషణలో కూడా వారి పాత్ర ముఖ్యమైనదే. గ్రాండ్ పేరెంట్స్ పిల్లలను సంరక్షిస్తున్న కారణంగా ఒక్క బ్రిటన్ కుటుంబానికి ఏడాదికి ఏడు వేల కోట్ల డాలర్లు ఆదా అవుతాయంటే ఆశ్చర్యం వేస్తోంది. ఎందుకంటే ఆ దేశంలో పిల్లల సంరక్షణ చాలా ఖరీదు. అయితే ఆస్ట్రేలియాలోనైతే 200 కోట్ల డాలర్లను ఓ కుటుంబం ఏడాదికి ఆదా చేయవచ్చు. నేడు ప్రపంచ జనాభా 760 కోట్లుకాగా, వారిలో 18 శాతం అంటే, 140 కోట్ల మంది గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు. అయితే వారి సంఖ్య ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంది. పెళ్లిళ్ల వయస్సు, తల్లిదండ్రుల్లో సంతానోత్పత్తి శక్తి, ప్రజల ఆయుషు ప్రమాణం అంశాలపై ఆధారపడి వారి సంఖ్య ఉంటుంది. వారి సంఖ్య ఇథియోపియా, కెన్యా, నైజీరియా, పాకిస్థాన్ దేశాల్లో అతి తక్కువగా 15 శాతం ఉండగా, కోస్టారికా, జపాన్, రష్యా, ఉక్రెయిన్‌లో 25 శాతం ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ పేరెంట్స్‌లో మహిళల సంఖ్యనే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల మంది అవ్వలు ఉండగా, 58 కోట్ల మంది తాతలు ఉన్నారు. ఇక పిల్లలే లేని వద్ధులు 60 లక్షల మంది ఉన్నారు. భారత్, పాకిస్థాన్, ఇండోనేసియా, టర్కీ లాంటి వర్ధమాన దేశాల్లో 40 ఏళ్లకు పైబడి పిల్లలు లేని వారి సంఖ్య ఐదు శాతానికన్నా తక్కువగా ఉంది. అదే అభివద్ధి చెందిన ఆస్ట్రేలియా, కెనడా, ఫిన్లాండ్, అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో 40 ఏళ్లకు పైబడి పిల్లలులేని తల్లుల సంఖ్య పది శాతానికిపైగా ఉండగా 50 ఏళ్లకు పైబడి పిల్లలులేని తల్లుల సంఖ్య 20 శాతానికిపైగా ఉండడం ఆశ్చర్యం. ఓ కుటుంబంలోని భార్యాభర్తలు ఎప్పుడు గ్రాంట్ పేరెంట్స్‌గా మారుతారన్న విశయం సాధారణంగా మొదటి సంతానం ఎప్పుడయింది అన్నదానిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కెనడా, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ లాంటి అభివద్ధి చెందిన దేశాల్లో ఓ మహిళకు తన 30వ ఏటా మొదటి సంతానం కలుగుతుంది. అంటే వారు గ్రాండ్ మదర్ అయ్యే వయస్సు దాదాపు 60 ఏళ్లు. బంగ్లాదేశ్, చాడ్, మాలి, నైగర్, జాంబియాలాంటి దేశాల్లో 20 ఏళ్లలోపే మహిళలకు మొదటి సంతానం కలుగుతుంది. అంటే వారు 40 ఏళ్ల నాటికి గ్రాండ్ మదర్స్ అవుతారు. ఎక్కువ సంతానోత్పత్తి కలిగిన ఉగాండ, కెన్యా, నైజీరియా లాంటి దేశాల్లో 50 ఏళ్లు మించిన వారి సంఖ్య వారి దేశ జనాభాలో పది శాతం కాగా, జర్మనీ, ఇటలీ, జపాన్ లాంటి దేశాల్లో 50 ఏళ్లు పైబడిన వారు వారి జనాభాలో దాదాపు 40 శాతం కావడం విశేషం. ఓ కుటుంబంలో గ్రాండ్ పేరెంట్స్ ఎంతకాలం జీవించి ఉంటారనే అంశం వారి పెళ్లీడు వయస్సు, అక్కడి జీవన ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. 20వ శాతాబ్దం ప్రారంభంలో అమెరికాలో మనిషి ఆయుష్సు ప్రమాణం 47 ఏళ్లుకాగా, గ్రాంట్ పేరెంట్స్‌గా 30 ఏళ్లు బతికిన వాళ్లు 20 శాతంకాగా, 77 ఏళ్ల ఆయుష్సు ప్రమాణం కలిగిన నేటి తరంలో గ్రాంట్ పేరెంట్స్‌గా 30 ఏళ్లు బతికే వాళ్లు దాదాపు 80 శాతం ఉంటున్నారు. గ్రాంట్ పేరెంట్స్‌లో కూడా ఎక్కువ కాలం బతుకుతున్న వాళ్లు మహిళలే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా నేడు బతికున్న శాతాధిక వద్ధుల్లో 80 శాతం మంది మహిళలే ఉన్నారు. వీరి సంఖ్య 21వ శాతాబ్దంలో మూడు రెట్లు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా శతాధిక వద్ధుల సంఖ్య నేడు 50 లక్షలుకాగా, వీరి సంఖ్య 2030 నాటికి బాగా పెరగనుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలోని ఎనిమిదేళ్ల పిల్లల్లో 70 శాతం మంది గ్రేట్ గ్రాండ్ పేరంట్స్ (ముత్తాతలు, ముత్తవ్వలు) అయ్యే అవకాశం ఉందని అంచనాలు తెలియజేస్తున్నాయి. ఆధునిక సమాజంలో గ్రాండ్ పేరెంట్స్ పాత్ర విశేషంగా పెరిగింది. భార్యాభర్తల్లో ఇద్దరు ఉద్యోగస్థులైతే పిల్లలను పూర్తిగా గ్రాండ్ పేరెంట్లే చూసుకోవాల్సి వస్తోంది. ఒంటిరి తల్లి లేదా ఒంటరి తండ్రున్న కుటుంబాల్లో కూడా పిల్లల పెంపకం బాధ్యత గ్రాండ్ పేరెంట్స్‌పైనే పడుతోంది. ఇక ఉద్యోగార్థం విదేశాలకు వలసపోయిన కుటుంబాల్లో వీరి పాత్ర మరీ ముఖ్యంగా తయారయింది. చాలా కుటుంబాల్లో గ్రాండ్ పేరంట్స్ పిల్లల పోషణతోపాటు ఆర్థికంగా కూడా అండగా ఉంటుందన్నారు. ఇంత పాత్రను పోషించే గ్రాంట్ పేరెంట్స్ గౌరవార్థం నేడు ప్రపంచంలోని ఎక్కువ దేశాలు ప్రతి ఏటా సెప్టెంబర్ 9వ తేదీన వారి దినోత్సవాన్ని జరుపుతున్నాయి. ఈ సారి కూడా ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, ఎస్టోనియా, జర్మనీ, ఇటలీ, మెక్సికో, పోలండ్, సింగపూర్, స్పెయిన్, బ్రిటన్ దేశాలు జరుపుకోగా అమెరికా ఈ రోజు అంటే సెప్టెంబర్ 10వ తేదీన జరుపుకుంటోంది. భారత్‌లో ఇది అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. -
యంగ్ మోడల్ ఎంత దారుణం చేసింది?
బెంగళూరు: మోడల్ అయి ఉండి ఓ యువతి మతిస్థిమితం లేని అమ్మాయిలా దుశ్చర్యకు పాల్పడింది. తన తాతాబామ్మలు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో వారిని ఇంట్లో వేసి తాళం వేసి అనంతరం నిప్పుపెట్టి తగులబెట్టింది. ఈ క్రమంలో ఆ వృద్ధ దంపతులు స్వల్పంగా గాయపడ్డారు. సర్వం కోల్పోయారు. ఈ చర్యకు దిగిన ఆ యువతి అనంతరం పారిపోయింది. ప్రస్తుతం పోలీసులు ఆమెకోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మైసూర్లో ప్రియా(22) అనే ఓ యువతి తన తాతాబామ్మలతో కలిసి ఉంటోంది. తల్లిదండ్రులు లేరు. ఆమె తల్లి బతికుండగానే తండ్రి మరో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే తల్లి చనిపోవడంతో ప్రస్తుతం తాతయ్యవాళ్లతో ఉంటోంది. ఆమెకు సిగరెట్లు తాగడం, మద్యం సేవించడంవంటి దుర్వ్యసనాలు కూడా అలవాటైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అప్పుడప్పుడు మోడలింగ్‌కు వెళుతున్న ప్రియా తనకు కొంత డబ్బు కావాలని అడుగగా వారు నిరాకరించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని ఇంట్లో పడేసి తలుపులేసి నిప్పంటించి పారిపోయింది. వారి అరుపులు విని చుట్టుపక్కలవారు వచ్చి ప్రాణాలతో రక్షించారు. అగ్నిమాపక యంత్రాలు వచ్చి మంటలు ఆర్పేశాయి. కాగా, తమ మనుమరాలిపై కేసు పెట్టేందుకు నిరాకరించారు. ఆమె తిరిగి తమ ఇంటికి రావాలని కోరుకుంటున్నారు. -
పుట్టిన రోజే అలియాభట్ ఎందుకు ఏడ్చేసింది?
ముంబయి: పుట్టిన రోజు వేడుకలంటే.. సాధారణంగా పండుగ వాతావరణంతో నిండిఉంటాయి. సరదాలుసంతోషాలు ఆ రోజు ఇంట్లో వెళ్లి విరుస్తాయి. ముఖ్యంగా ఆ పుట్టిన రోజు జరుపుకుంటున్న వ్యక్తి ముఖం ఆ రోజంతా నిండా విచ్చుకున్న తామరలా ఉంటుంది. కానీ, ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ మాత్రం తన పుట్టిన రోజు ఏడ్చేసింది. అయితే అదేదో బాధతో కాదు. ఆనంద పరవశంతో.. కళ్లతో కాదు హృదయంతో.. బహుషా ఏ స్నేహితుల మధ్య గడిపినా దక్కని ఆనందం.. లక్షలు ఖర్చుపెట్టి ఏ లగ్జరీ హోటల్లో పుట్టిన రోజు జరుపుకున్నా దొరకని సంతోషం అలియా సొంతమైంది. ఆమె తాతబామ్మలు స్వయంగా పుట్టిన రోజు గీతాన్ని సంగీత రూపంలో వాయిస్తూ ఆమెకు విషెస్ చెప్పడంతో ఆ దృశ్యాన్ని తన మొబైల్ ఫోన్లో బందిస్తూ హృదయం ఉప్పొంగి ఏడ్చేసింది. అది కూడా అలియా ఎనిమిదేళ్ల ప్రాయంలో ఉండగా. ఈ మెమొరబుల్ వీడియోను పుజాభట్ ఇన్‌స్టాగ్రమ్ ద్వారా పంచుకుంది.