
ఈ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారే...
వాళ్ల రెండు నాల్కల ధోరణే వేరు. వీళ్లు పేరెంట్స్‌గా ఉన్నప్పుడు తమ పిల్లలు అన్నం తినకపోయినా... సరిగా చదవక΄ోయినా... మాట వినక΄ోయినా విపరీతంగా తిట్టేవారు. కసితీరా కొట్టేవారు. వెరసి... చెడుగుడాడేవాళ్లూ... చెమడాలెక్కతీసేవాళ్లు. ఈ ధోరణితో వాళ్లు ప్రవర్తిస్తున్న కాలంలో పిల్లలుగా మనం బితుకూ బితుకూమంటూ బతికేవాళ్లం. ఎట్టకేలకు వాళ్లిప్పుడు గ్రాండ్స్‌పేరెంట్స్ అయ్యారు.
కాలచక్రం గిర్రున తిరిగి మనకూ ఇప్పుడు పిల్లలు పుట్టారు. కాలేజీలో జూనియర్స్ సీనియర్స్ అయి ‘పేరేంట్య్రాగింగు’ పర్వదినాల కోసం మనమూ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నామా...? అదృష్టవశాత్తూ ఇప్పుడు మన వంతు రాగానే మన పిల్లలు అన్నం తిననప్పుడు మనం బెల్టు పట్టుకోబోయామా... వాళ్లెదురుగా వచ్చి పిల్లలముందు నిలబడిపోతారు. బెత్తం పట్టుకోబోయామా... అడ్డంగా వచ్చేసి కలబడిపోతారు. థూ మన బతుకుచెడా... మన బండపడా... అప్పుడు మనం పిల్లలుగా ఉన్నప్పుడూ బితుకూ బితుకే...
ఇప్పుడూ అదే బతుకే!
వాళ్లే మన పేరెంటూ... మన నాటి పేరెంట్సే... నేటి గ్రాండ్ పేరెంట్సు. మళ్లీ సదరు గ్రాండు పేరెంట్సు... గ్రాండుగా వాళ్లు చెప్పొచ్చేదేమిటంటే... ‘‘ఏం మాకు పిల్లలు పుట్టలేదా? మేం పెంచలేదా, పెంచడం మాకు తెలియదా’’ అంటూ దబాయింపు. అలా వాళ్లు తమ రెండు నాల్కల ధోరణితో మనల్ని నానామాటలు అంటూ ఉంటే... సదరు మన పేరెంట్సుకూ, మన పిల్లల గ్రాండుపేరెంట్సుకూ ఎదురుచెప్పకూడదంటూ మనలో మనం అనేసుకునే మాటేమిటంటే... ‘‘అయ్యో.... మీకు తెలియక΄ోవడమేమిటీ? అప్పుడు మీరు పెంచిందీ, గసిరిందీ, కొట్టిందీ మమ్మల్నే... ఇప్పుడు పిల్లల ఎదురుగా నిలబడి΄ోతూ, కలబడిపోతూ గసురుతున్నదీ, మాటలు విసురుతున్నదీ మమ్మల్నే!’’ అంటూ గుసగుసగా గునుస్తూ... నేటి మన గ్రాండ్ పేరెంట్స్ గాండ్రుగాండ్రుల పట్ల మురుస్తూ ఇలా బతికేస్తున్నాం... బతికేస్తుంటాం.
(చదవండి: