
సత్యరాజ్, వశిష్ఠ ఎన్. సింహా, ‘సత్యం’ రాజేశ్, ఉదయభాను, సాంచి రాయ్ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. మారుతీ టీమ్ ప్రొడక్ట్ సమర్పణలో విజయ పాల్ రెడ్డి అడిదల నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ‘‘మా సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఎక్కువగా మహిళా ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు.
అందుకే ఓ ఆఫర్ ఇస్తున్నాం. సెప్టెంబర్ మొదటి వారంలో గ్రాండ్ పేరెంట్స్ డే (సెప్టెంబర్ 7). ఈ నేపథ్యంలో ఆగస్ట్ 30, ఆగస్ట్ 31న ప్రదర్శించే సాయంత్రం ఆటకు కుటుంబంతో కలిసి వచ్చే గ్రాండ్ పేరెంట్స్‌కి ఉచితంగా ప్రవేశం కల్పించనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది.