సినీ నటుడు నాగచైతన్య సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ చేశారు. తను నటించిన తొలి వెబ్‌సిరీస్ 'దూత' రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. నిజాయతీగా ఒక ప్రాజెక్ట్ కోసం పనిచేస్తే ప్రేక్షకులు తప్పకుండా కనెక్ట్ అవుతారని దూత నిరూపించిందని నాగచైతన్య అభిప్రాయపడ్డారు. నటుడిగా సృజనాత్మకమైన కథను ఎంపిక చేసుకుని అందుకు తగ్గట్టుగా నిజాయతీతో పని చేసి ఆపై మంచి ప్రదర్శన ఇస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆయన అన్నారు. ‘దూత’ రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన అందరికీ ధన్యవాదాలు చెబుతూ ఒక పోస్ట్ చేశారు.
దూత వెబ్‌సిరీస్ చాలా బాగా నచ్చిందంటూ అభిమానులు కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. సీజన్-2 ఎప్పుడు తీసుకోస్తారంటూ వారు కోరుతున్నారు. దర్శకుడు విక్రమ్ కె. కుమార్ తెరకెక్కించిన ఈ సిరీస్ 2023 డిసెంబరు 1న ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో విడుదలైంది. ఇందులో జర్నలిస్టు సాగర్ వర్మ పాత్రలో నాగచైతన్య మెప్పించారు. నాగచైతన్య దూత వెబ్ సిరీస్ గురించి ట్వీట్ చేయడంతో సమంత పెళ్లి గురించి కూడా కామెంట్ల రూపంలో అడుగుతున్నారు.


