బాలయ్య- బోయపాటి కాంబోలో వస్తోన్న మరో చిత్రం అఖండ-2. గతంలో రిలీజై సూపర్ హిట్గా నిలిచిన అఖండకు సీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, టీజర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ మూవీ నుంచి హైందవం సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. నాగ గురునాథ శర్మ లిరిక్స్ రాసిన ఈ పాటను సర్వేపల్లి సిస్టర్స్‌గా గుర్తింపు పొందిన సింగర్స్ శ్రేయ, రాజ్యలక్ష్మి పాడారు. ఈ పాట బాలయ్య అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ సాంగ్కు తమన్ సంగీతమందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది.


