బేబీ మూవీతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన జంట ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య. ఈ ఒక్క మూవీతో అందరి కళ్లు తనవైపు తిప్పుకునేలా చేసింది వైష్ణవి చైతన్య. తన మాస్ నటనతో ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. మరోసార ఈ జంట తెరపై కనిపిస్తే ఎలా ఉంటుంది. అదే నిజం చేయబోతోంది ఈ బేబీ జంట ఆనంద్- వైష్ణవి.
తాజాగా వీరిద్దరు జంటగా నటిస్తోన్న చిత్రం ఎపిక్. ఈ మూవీ టైటిల్ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఎపిక్- ఫస్ట్ సెమిస్టర్ అనే పేరుతో రిలీజ్ చేసిన గ్లింప్స్ అభిమానులను అలరిస్తోంది. ఈ ప్రేమకథా చిత్రాన్ని 90స్ వెబ్‌సిరీస్‌లోని పాత్రలతో రూపొందిస్తున్నారు. తాజాగా విడుదలైన గ్లింప్స్లో ది శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోలాంటి అబ్బాయికి.. సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హీరో లాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథ అనే డైలాగ్ మరింత ఆసక్తిని పెంచుతోంది. కాగా.. ఈ మూవీకి 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.


