'సీతారామం'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మృణాల్ ఠాకుర్.. తర్వాత టాలీవుడ్‌లో మరో రెండు సినిమాలు చేసింది. అనంతరం పూర్తిగా హిందీపై ఫోకస్ పెట్టింది. ఎప్పటికప్పుడు ఏదోలా సోషల్ మీడియాలో ఈమె గురించి చర్చ నడుస్తూనే ఉంటుంది. తాజాగా ఈమె.. టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో డేటింగ్‌లో ఉందనే రూమర్స్ వచ్చాయి. ఇవి మృణాల్ వరకు చేరడంతో క్లారిటీ ఇచ్చింది.
(ఇదీ చదవండి: 'భూత శుద్ది వివాహం' చేసుకున్న సమంత.. ఏంటి ఆచారం?)
'ఇలాంటి రూమర్స్ వినడానికి చాలా కామెడీగా ఉంటాయి. వాళ్లు వార్తలు సృష్టిస్తుంటారు. వాటిని చూసి నేను నవ్వుకుంటాను. ఉచితంగా చేసే పీఆర్ స్టంట్స్ ఇవి' అని మృణాల్ తనపై వస్తున్న డేటింగ్ వార్తల్ని కొట్టిపారేసింది. గతంలో తమిళ హీరో ధనుష్‌తోనూ ఈమె డేటింగ్ చేస్తుందనే వార్తలు రాగా.. అతడు తన స్నేహితుడు మాత్రమేనని చెప్పుకొచ్చింది. మరి నెక్స్ట్ ఏ సెలబ్రిటీతో మృణాల్ డేటింగ్ అని వార్తలొస్తాయో చూడాలి?
ఈ ఏడాది హిందీలో పలు చిత్రాలతో వచ్చిన మృణాల్.. వచ్చే ఏడాది తెలుగు, హిందీ మూవీస్‌తో రాబోతుంది. అడివి శేష్ 'డకాయిట్'లో ఈమె హీరోయిన్‌గా చేస్తోంది. ఇది వచ్చే ఏడాది మార్చిలో రానుందని ఇదివరకే ప్రకటించారు. అలానే అల్లు అర్జున్-అట్లీ కాంబోలో తీస్తున్న సినిమాలోనూ ఈమె ఒక హీరోయిన్ అని అంటున్నారు. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు.
(ఇదీ చదవండి: డిసెంబరులో వచ్చే సినిమాలేంటి? క్లైమాక్స్ ఎలా ఉండబోతోంది?)


