సమంత మరో పెళ్లి చేసుకుంది. గత కొన్నాళ్లుగా వస్తున్న రూమర్స్‌ని నిజం చేస్తూ 'ద ఫ్యామిలీ మ్యాన్' దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించింది. కోయంబత్తూర్‌లోని ఈశా ఫౌండేషన్‌లోని లింగ భైరవి దేవి సన్నిధిలో ఈ శుభాకార్యం జరిగింది. అయితే 'భూత శుద్ధి ఆచారం' అనే సంప్రదాయం ప్రకారం సమంత.. ఈ వివాహం చేసుకుంది. ఇంతకీ ఏంటిది? దీనికి అర్థం ఏంటి?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు రిలీజ్)
కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో అనాదిగా వస్తున్న యోగ సంప్రదాయం ప్రకారం సమంత పెళ్లిని నిర్వహించారు. ఆలోచనలు, భావోద్వేగాలు లేదా భౌతికతకు అతీతంగా, దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన విశిష్టమైన పవిత్ర ప్రక్రియే ఈ 'భూత శుద్ధి వివాహం'.
ఈశా యోగ కేంద్రలో ప్రాణ ప్రతిష్ట చేసిన లింగ భైరవి దేవి.. స్త్రీ శక్తికి సంబంధించిన ఉగ్ర, కారుణ్య స్వరూపం. జీవితాన్ని సుసంపన్నం చేసే ఎన్నో విశిష్ట ఆచారాలకు ఈ ఆలయం నెలవు. విశ్వంలోని సృజనాత్మక శక్తికి ప్రతీకగా నిలిచే ఈ ఎనిమిది అడుగుల శక్తి స్వరూపం. భక్తుల మనశ్శరీరాలకు, శక్తులని స్థిరపరుస్తూ, పుట్టుక నుంచి మరణం వరకు జీవితంలోని ప్రతిదశలోనూ వారికి అండగా నిలుస్తుంది. ఈ విషయాన్ని ఈశా ఓ ప్రకటన రూపంలో తెలియజేసింది. ప్రస్తుతం సమంత పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: రాజ్ ఎవరు? సమంతతో పరిచయం ఎలా? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)


