ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘యుఫోరియా’. భూమిక చావ్లా, గౌతమ్ వాసుదేవ మీనన్, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి కీలక పాత్రలు పోషించారు. రాగిణి గుణ సమర్పణలో గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ , యుక్తా గుణ నిర్మించారు. ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తొలుత ప్రకటించారు. అయితే తాజాగా 2026 ఫిబ్రవరి 6న రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ పేర్కొంది.
‘‘నేటి యువతకి, కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో గుణశేఖర్ ‘యుఫోరియా’ తీశారు. మా సినిమాని ఈ నెల 25న విడుదల చేయాలనుకున్నాం. అయితే ఈ క్రిస్మస్‌కి అనుకోకుండా చాలా సినిమాలు రిలీజ్‌లకు సిద్ధమయ్యాయి. ఈ బాక్సాఫీస్ రద్దీని తగ్గించటానికి, ‘యుఫోరియా’ మూవీకి మంచి రిలీజ్ డేట్ అవసరమని భావించి, 2026 ఫిబ్రవరి 6న విడుదల చేయబోతున్నాం. మా చిత్రం ద్వారా ప్రేక్షకులను ఆలోచింప చేసేలా, గొప్ప అనుభూతిని అందించాలి అనేది మా ఆలోచన’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: కాల భైరవ, కెమెరా: ప్రవీణ్ కె పోతన్.


