నాని-నితిన్ 'అలియాస్ రుక్మిణీ'.. గ్లింప్స్ చూశారా? | Nani And Nithiin For Alias Rukmini Movie | Sakshi
Sakshi News home page

Nani-Nithiin: చిత్రమైన ప్రేమకథ? ఫన్నీ గ్లింప్స్ రిలీజ్

Aug 3 2026 10:43 AM | Updated on Aug 3 2026 10:52 AM

Nani And Nithiin For Alias Rukmini Movie

'ప్యారడైజ్' సినిమాతో బిజీగా ఉన్న నాని.. నిర్మాతగా కొత్త మూవీ మొదలుపెట్టేశాడు. గత కొన్నిరోజుల నుంచి వస్తున్న రూమర్స్ నిజం చేస్తూ నితిన్ హీరోగా కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. సోమవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ఈ ప్రాజెక్ట్ మొదలైంది. 'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దీనికి దర్శకుడు. తాజాగా టైటిల్ రివీల్ చేశారు. 'అలియాస్ రుక్మిణీ' అనే అచ్చ తెలుగు పేరుని ఫిక్స్ చేశారు.

ఇంజినీరింగ్ బుక్స్ ముందేసుకుని పడుకునే హీరోని చూపిస్తూ.. గరం గోపాల్, ఆమెకు ఆమెంటే ఇష్టం, వ్రతం వెంకన్న పుస్తకాల్ని చూపించారు. వీటిని రాసింది రుక్మిణి అనే మహిళ. ఈమె ఎవరా అని మనం ఆలోచిస్తుండగా.. ఆమె నా భార్య అని హీరో పాత్రధారి అయిన నితిన్ చెప్పడం బాగుంది. మరి రొమాంటిక్ నవలలు రాసే భార్య ఉన్న హీరో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడనేది స్టోరీనా అనిపిస్తుంది. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు వెల్లడించారు. విజయ్ బుల్గానిన్ నేపథ్య సంగీతం బాగుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement